కల్తీ కల్లు దొరక్క ఉరేసుకున్నాడు.. | man commit Suicide | Sakshi
Sakshi News home page

కల్తీ కల్లు దొరక్క ఉరేసుకున్నాడు..

Sep 23 2015 9:08 AM | Updated on Nov 6 2018 7:56 PM

కల్తీ కల్లు దొరక్క మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరుకి చెందిన చంద్రయ్య అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

కల్లీ కల్లు మృతుల పరంపర కొనసాగుతూనే ఉంది. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలంలో తాజా ఘటన చోటుచేసుకుంది. మండలంలోని ఎనుములనర్వ గ్రామానికి చెందిన చంద్రయ్య(65) స్థానికంగా దొరికే కల్తీ కల్లుకు బానిసయ్యాడు. ప్రస్తుతం అది దొరక్కపోవటంతో నాలుగైదు రోజులుగా పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే మంగళవారం రాత్రి చెట్టుకు ఉరేసుకున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement