టీఎంయూలోకి భారీగా చేరికలు | Leaders TMU In Join In Nizamabad | Sakshi
Sakshi News home page

టీఎంయూలోకి భారీగా చేరికలు

May 5 2018 10:40 AM | Updated on May 5 2018 10:42 AM

Leaders TMU In Join In Nizamabad - Sakshi

టీఎంయూలో చేరిన ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు

నిజామాబాద్‌నాగారం : ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌లో ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు పెద్ద సంఖ్యలో చేరారు. టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వద్ధామరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని నిర్వహించిన సమావేశంలో ఈయూ డిపో–1 కార్యదర్శి అబ్బయ్య నేతృత్వంలో పెద్ద ఎత్తున కార్మికులు టీఎంయూలో చేరారు. నాయకులను, కార్మికులను అశ్వద్ధామరెడ్డి పూలమాలలతో సత్కరించి సాదారంగా తమ యూనియన్‌లోకి ఆహ్వానించారు.

ఈయూలో కొంత మంది నేతల వల్ల కార్మికులకు అన్యాయం జరుగుతోందని అందుకే టీఎంయూలో చేరుతున్నట్లు వారు చెప్పారు. ఈయూ డిపో–1 చైర్మన్‌ సుధాకర్, రీజినల్‌ కోశాధికారి నందిపేట్‌ శ్రీనివాస్, సాయిబాబా సహా 100 మంది కార్మికులు టీఎంయూలో చేరడంతో ఎంప్లాయీస్‌ యూనియన్‌కు పెద్ద దెబ్బ తగిలింది. టీఎంయూ రాష్ట్ర కార్యదర్శి వందేమాతరం శ్రీనివాస్, మురలీధర్, రీజినల్‌ కార్యదర్శి మాక్లూర్‌ శేఖర్, సీహెచ్‌ నర్సయ్య, నర్సయ్య పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement