కార్మికుడి ఆత్మహత్య | labour suicides of financial problems | Sakshi
Sakshi News home page

కార్మికుడి ఆత్మహత్య

Sep 13 2015 7:49 PM | Updated on Oct 2 2018 5:51 PM

అప్పులబాధ భరించలేక కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పట్టణం నెహ్రూనగర్‌కు చెందిన కోడం శ్రీకాంత్ (28) అనే యువ కార్మికుడు ఆదివారం వేకువజామున ఆత్మహత్య చేసుకున్నాడు.

కరీంనగర్ (సిరిసిల్ల): అప్పులబాధ భరించలేక కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పట్టణం నెహ్రూనగర్‌కు చెందిన కోడం శ్రీకాంత్ (28) అనే యువ కార్మికుడు ఆదివారం వేకువజామున ఆత్మహత్య చేసుకున్నాడు. టెక్స్‌టైల్ పార్క్‌లో శ్రీకాంత్ సాంచాలు నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. మూడునెలల క్రితం టెక్స్‌టైల్ పార్క్ నుంచి సిరిసిల్లకు వచ్చేందుకు బైక్ లిఫ్ట్ అడిగి వస్తుండగా, రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న వ్యక్తి మరణించాడు.

శ్రీకాంత్ తీవ్రంగా గాయపడి కాలు విరిగిపోయింది. వైద్యం కోసం అప్పు చేయాల్సి వచ్చింది. ఇంట్లోనే ఉంటూ పనికి వెళ్లేందుకు వీలు లేకపోవడంతో ఉపాధి కరువై అప్పులు పెరిగిపోయాయి. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. అతడి భార్య అర్చన కూడా ఇటీవల అనారోగ్యం బారిన పడింది. అప్పులబాధలు, పని లేక మంచానికే పరిమితం కావడంతో తీవ్ర మనోవేదనకు గురైన శ్రీకాంత్ ఆదివారం ఉదయం ఇంట్లోనే ఉరేసుకున్నాడు. శ్రీకాంత్‌కు భార్య అర్చన, కుమారుడు సాకేత్ (2) ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement