ఉపాసన ట్వీట్‌పై కేటీఆర్‌ స్పందన | KTR Thanks To Upasana For Invest Telangana Promotion In WEF | Sakshi
Sakshi News home page

నా కొత్త జాబ్‌ ఎలా ఉంది; థాంక్స్‌ ఉపాసన!

Jan 25 2019 6:33 PM | Updated on Jan 25 2019 7:39 PM

KTR Thanks To Upasana For Invest Telangana Promotion In WEF - Sakshi

‘కేటీఆర్‌ గారు నా కొత్త జాబ్‌ ఎలా ఉంది’

దావోస్‌ : దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ వాణిజ్య సదస్సు కార్యక్రమంలో వ్యాపారవేత్త, హీరో రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన సందడి చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ఇన్‌వెస్ట్‌తెలంగాణ ప్రోగ్రామ్‌ను ఆమె ప్రమోట్‌ చేశారు. ఈ క్రమంలో.. ‘కేటీఆర్‌ గారు నా కొత్త జాబ్‌ ఎలా ఉంది. ప్రపంచ వాణిజ్య సదస్సులో తెలంగాణ పెవిలియన్‌లో కూర్చుని ఇన్‌వెస్ట్‌తెలంగాణ టీమ్‌కు సహాయం చేశాను. ప్రపంచంలోనే నివాసయెగ్యమైన ప్రదేశాల్లో మూడో స్థానం, ఇండియా స్టార్టప్‌ క్యాపిటల్‌, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ నంబర్‌ వన్‌ తెలంగాణ. ఇవన్నీ పెట్టుబడిదారులను ఆకర్షించే అంశాలు’  అంటూ ట్వీట్‌ చేశారు.

కాగా ఉపాసన ట్వీట్‌కు స్పందించిన టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌... ‘మా టీమ్‌కు సహాయడినందుకు నీకు ధన్యవాదాలు ఉపాసన’ అంటూ కృతఙ్ఞతలు తెలిపారు. ఇక సామాజిక అంశాలపై స్పందించే ఉపాసన గతంలో తాను దివ్యాంగుల వసతి గృహాన్ని సందర్శించిన సమయంలో.. ఆ హాస్టల్‌కు నూతన భవనం మంజూరు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతూ కేటీఆర్‌కు ట్వీట్‌ చేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కేటీఆర్‌.. ‘పాఠశాలకు నూతన భవనం మంజూరు కావడం సంతోషం.. అయితే వసతి గృహానికి నూతన భవనం మంజూరు చేయాలంటే డిసెంబరు 11 కదా ఆగాల్సిందే’ అంటూ సమాధానమిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement