మోడీ వచ్చినా డిపాజిట్ దక్కదు: కేటీఆర్ | ktr fire on bjp leaders | Sakshi
Sakshi News home page

మోడీ వచ్చినా డిపాజిట్ దక్కదు: కేటీఆర్

Sep 6 2014 1:04 AM | Updated on Mar 29 2019 9:24 PM

మోడీ వచ్చినా డిపాజిట్ దక్కదు: కేటీఆర్ - Sakshi

మోడీ వచ్చినా డిపాజిట్ దక్కదు: కేటీఆర్

మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికలో ప్రధాని నరేంద్ర మోడీతో ప్రచారం చేయించినా బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ దక్కదని మంత్రి కె. తారకరామారావు అన్నారు.

మిరుదొడ్డి: మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికలో ప్రధాని నరేంద్ర మోడీతో ప్రచారం చేయించినా బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ దక్కదని మంత్రి కె. తారకరామారావు అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా మిరుదొడ్డిలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్యవాది అయిన జగ్గారెడ్డి అంటేనే మెదక్ జిల్లా ప్రజలు భగ్గు మంటున్నారన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని సునీతా లక్ష్మారెడ్డికి తెలంగాణ ప్రజల ఓట్లను అడిగే నైతిక హక్కు లేదన్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement