ఒక్క కొబ్బరికాయతోనే అభివృద్ధి | Sakshi
Sakshi News home page

ఒక్క కొబ్బరికాయతోనే అభివృద్ధి

Published Mon, Nov 26 2018 11:34 AM

Komati Reddy Rajagopal Reddy Canvass In Chandur - Sakshi

సాక్షి, చండూరు : టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల మాదిరిగా ఊర్లో జరిగే ప్రతి పనికి ఓ కొబ్బరి కాయకొట్టడం మా నైజం కానే కాదని ఏ ఊరిలోనైనా ఒక్క కొబ్బరికాయతో ఆ ఊరి అభివృద్ధి జరిగిపోవాల్సిందేనని మహాకూటమి బలపర్చిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని బోడంగిపర్తి, తాస్కానిగూడెం, ఇడికూడ, బంగారిగడ్డ, తుమ్మపల్లి, అంగడిపేట, తిమ్మారెడ్డిగూడెం, కొండాపురం, కమ్మగూడెం, శేరిగూడెం, శిర్ధేపల్లి తదితర గ్రామాలలో రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. తాజా, మాజీ ఎమ్మెల్యేలు గ్రామాలలో అనేక కొబ్బరికాయలు కొడుతూ కాలయాపన చేసేవారని, ఇక అలాంటి పనులు నేను చేయనన్నారు. మునుగోడు ప్రజలు తమ నియోజకవర్గానికి మీ సేవలు అవసరమని కోరడంతోనే తాను ఇక్కడి నుంచి పోటీలో ఉన్నానన్నారు.

తనపై కేసీఆర్, కేటీఆర్‌ పోటీ చేసినా గెలిచే సత్తాలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందు టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులకు మాట్లాడే దమ్ము తేదని దీంతో అభివృద్ధి ఏం చేయగలరని, అదే నేను అధిష్టానంతో ధైర్యంగా మాట్లాడి పల్లెను అభివృద్ధి చేయగలనని ఆయన భరోసా కల్పించారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే తాను సామాన్యులకు అందుబాటులో ఉంటానన్నారు, శేశిలేటి వాగు పనులు, వెల్మకన్నె ఫీడర్‌ చానల్‌ పనులు, బెండలమ్మ చెర్వు పనులను వెంటనే పూర్తి చేయించగలనన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేసే విధంగా తన వంతుగా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాస్‌ నేత, కార్యదర్శి కర్నాటి వెంకటేశం, ఎంపీపీ తోకల వెంకన్న, జెడ్పీటీసీ అన్నెపర్తి సంతోషశేఖర్, టీడీపీ మండల అధ్యక్షుడు బొబ్బలి శ్రీనివాస్‌ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ మాదగాని విజయలక్ష్మి, భీమనపల్లి శేఖర్, పున్న ధర్మేందర్, కోడి గిరి బాబు, దోటి వెంకటేశ్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.  
కాంగ్రెస్‌లో చేరిన కురుమ సంఘం నాయకులు
మునుగోడు : మండలంలోని పలివెల గ్రామానికి చెందిన కురుమ సంఘం నాయకులు ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సంఘంలోని దాదాపు 40 మంది సభ్యులు చేరారు. చేరిన వారిలో గుర్జ నర్సింహ, గుత్తి పెద్దగాలయ్య, చెరుపల్లి గోపాల్, గుత్తి శ్రీశైలం, నర్సింహ,, రమేష్, చెరుపల్లి అంజయ్య, లింగస్వామిలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు వేమిరెడ్డి సురేందర్‌రెడ్డి, జిల్లా నాయకుడు గోసుకొండ శంకర్, మాజీ సర్పంచ్‌ చెర్కు జనార్దన్, చెరుపల్లి వెం కన్న, గోసుకొండ చంద్రయ్య, భాస్కర్, మత్స్యగిరి, మా ర్త నర్సిరెడ్డి, కూన్‌రెడ్డి సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  
14 గ్రామాల్లో కోమటిరెడ్డి ప్రచారం
చండూరు : కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభర్థి కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఆదివారం మండలంలోని 14 గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. మండల కేంద్రంలో పలువురు కార్యకర్తలకు టీని అందించారు. అదే విధంగా కోడి శ్రీనివాసులు ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కోడి శ్రీనివాసులు తన అనుచరులతో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.   

Advertisement
 
Advertisement
 
Advertisement