గవర్నర్కు హైదరాబాద్ శాంతిభద్రతల అధికారం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.
న్యూఢిల్లీ : గవర్నర్కు హైదరాబాద్ శాంతిభద్రతల అధికారం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఆయన శనివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ గవర్నర్కు అధికారం అంశంపై బీజేపీ పాత్రలేదన్నారు. తెలంగాణ బిల్లు పాస్ అయినప్పుడు సోనియా గాంధీని కలిసి కేసీఆర్ విందు తీసుకున్నారని, అప్పుడు ఈ విషయాన్ని సోనియాను ఎందుకు ప్రశ్నించలేదని కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ బెదిరింపులకు భయపడేది లేదని ఆయన స్ఫష్టం చేశారు. గవర్నర్ అధికారాలపై తెలంగాణ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని కిషన్ రెడ్డి తెలిపారు.