ప్రశాంత్‌రెడ్డి అనే నేను..!

KCR Likely To Induct Vemula Prashanth Reddy As Minister - Sakshi

మంత్రి వర్గంలో చోటు

నేడు ప్రమాణ స్వీకారం

బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనకు ఏ శాఖ కేటాయిస్తారనే అంశంపై నేడు స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.  ప్రశాంత్‌రెడ్డి గత ప్రభుత్వ హయాంలో కూడా కేబినెట్‌ హోదాలో మిషన్‌భగీరథ వైస్‌ చైర్మన్‌గా పనిచేశారు. నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించా రు. ముఖ్యంగా సాగునీటి వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు. ప్రత్యే క రాష్ట్ర సాధన లక్ష్యంగా  తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: మంత్రివర్గ విస్తరణలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డికి చోటు దక్కింది. మంగళవారం ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రశాంత్‌రెడ్డి సోమవారం హైదరాబాద్‌లోని సీ ఎం నివాసం ప్రగతిభవన్‌లోనే ఉన్నారు. ఈ మేరకు ఆయనకు సీఎం కేసీఆర్‌ స్వయంగా చెప్పారు. ప్రశాంత్‌రెడ్డికి ఏ శాఖ కేటాయిస్తారనే అంశంపై మంగళవారమే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. తమ నేతకు మంత్రి పదవి లభించనుండటంతో నియోజకవర్గంలో ఆయన అనుచరుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ప్రశాంత్‌రె డ్డి 2014, తాజాగా జరిగిన ఎన్నికల్లో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 

గత ప్రభుత్వ హయాంలోనే.. 
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన ప్రశాంత్‌రెడ్డి గత ప్రభుత్వ హయాంలో కూడా కేబినెట్‌ హోదాలో మిషన్‌భగీరథ వైస్‌ చైర్మన్‌గా పనిచేశారు. ఈసారి కేసీఆర్‌ నేరుగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. స్వతహాగా ఇంజనీర్‌ అయిన ప్రశాంత్‌రెడ్డికి కేసీఆర్‌ తన కలల ప్రాజెక్టు అయిన మిషన్‌ భగీరథ (వాటర్‌గ్రిడ్‌) బాధ్యతలను అప్పగించారు. 2016లో ఏప్రిల్‌ 29న ఆయన మిషన్‌భగీరథ వైస్‌ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు తీసుకున్నారు. అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ఈ ప్రాజెక్టు పనులను ముం దుకు తీసుకెళ్లడంలో కృషి చేశారు. 

ఉద్యమంలో చురుగ్గా.. 
2001లో కేసీఆర్‌ స్థాపించిన టీఆర్‌ఎస్‌ పార్టీలో తం డ్రి వేముల సురేందర్‌రెడ్డితో కలిసి పని చేశారు. తెలంగాణ ఉద్యమం లో చురుగ్గా పా ల్గొన్నారు. 2010లో సీఎం కేసీఆర్‌ ప్రశాంత్‌రెడ్డికి నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఉద్యమ సమ యంలో కేసీఆర్‌ ఇచ్చిన  పిలుపు మేరకు నియోజక వర్గంలో ఉద్యమాన్ని చేపట్టారు. సాగరహారం, అసెంబ్లీ ముట్ట డి, రైల్‌రోకో, వంటావార్పు లాంటి అనేక ఆం దోళన, నిరసన కార్యక్రమాల్లో పాల్గొ న్నారు. ఉద్యమ సమయంలో రైల్‌రోకో, ఇతర కేసులు ఎదుర్కొన్నారు. 

నియోజకవర్గ అభివృద్ధికి.. 
2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన ప్రశాంత్‌రెడ్డి నియోజకవర్గ అభి వృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా సాగునీటి వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు. చెక్‌డ్యామ్‌లు, ఇలా 40  ప్రత్యేక సాగునీటి పనులను రూ.200 కోట్లతో చేపట్టారు. నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలైన రోడ్లు పనులకు భారీగా నిధులు మంజూరయ్యాయి.

ప్రశాంత్‌రెడ్డి బయోడేటా.. 
పేరు:  వేముల ప్రశాంత్‌రెడ్డి 
విద్యార్హత : బీఈ సివిల్‌ (బాల్కి, కర్ణాటక)  
తండ్రి: కీ.శే.వేముల సురేందర్‌రెడ్డి  
తల్లి : మంజుల 
భార్య : నీరజా రెడ్డి 
కుమారుడు :  పూజిత్‌రెడ్డి– ఎంబీబీఎస్‌ 
కుమార్తె : మానవి రెడ్డి (బీటెక్‌)– సీబీఐటీలో  
సోదరుడు : వేముల శ్రీనివాస్‌ (అజయ్‌రెడ్డి– వెటర్నరీ సీనియర్‌ డాక్టర్‌) 
సోదరి : రాధిక (గ్రూప్‌–1 ఆఫీసర్‌) 
జననం: 14.03.1966 
బాల్యం విద్యాభ్యాసం : వేల్పూర్, కిసాన్‌నగర్‌  
వృత్తి : ప్రఖ్యాత బిల్డర్‌గా హైదరాబాద్‌లో పేరుగాంచారు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top