'కేసీఆర్ని ఆదర్శంగా తీసుకుంటేనే అభివృద్ధి' | kcr is a model of development telangana, says Harish rao | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ని ఆదర్శంగా తీసుకుంటేనే అభివృద్ధి'

Oct 10 2014 1:33 PM | Updated on Aug 15 2018 9:22 PM

'కేసీఆర్ని ఆదర్శంగా తీసుకుంటేనే అభివృద్ధి' - Sakshi

'కేసీఆర్ని ఆదర్శంగా తీసుకుంటేనే అభివృద్ధి'

తెలంగాణ అభివృద్ధి జరగాలంటే... రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆదర్శంగా తీసుకోవాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావు ప్రజా ప్రతినిధులకు సూచించారు.

మెదక్: తెలంగాణ అభివృద్ధి జరగాలంటే... రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆదర్శంగా తీసుకోవాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావు ప్రజా ప్రతినిధులకు సూచించారు. అలాగే ప్రభుత్వ అధికారులు ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. శుక్రవారం మెదక్లో హరీశ్రావు మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లను రెసిడెన్షీయల్గా మార్చబోతున్నారని చెప్పారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాడిన తర్వాత తొలిగా ఏర్పాటైన కేసీఆర్ ప్రభుత్వం పాలనతో దూసుకుపోతుందని హరీశ్రావు వెల్లడించారు. ప్రభుత్వ రెసిడేన్షియల్ హాస్టళ్ల అభివృద్ధికి, విద్యార్థుల అభివృద్ధికి ఐపీఏస్ అధికారి ప్రవీణ్ కుమార్ అందిస్తున్న సేవలను హరీశ్రావు ఈ సందర్బంగా ప్రస్తుతించారు.

Advertisement
 
Advertisement
Advertisement