కరీంనగర్ బాలికకు గిన్నిస్‌లో స్థానం | Karimnagar girl to a place in the Guinness | Sakshi
Sakshi News home page

కరీంనగర్ బాలికకు గిన్నిస్‌లో స్థానం

Sep 3 2015 2:14 AM | Updated on Aug 21 2018 2:34 PM

కరీంనగర్ బాలికకు గిన్నిస్‌లో స్థానం - Sakshi

కరీంనగర్ బాలికకు గిన్నిస్‌లో స్థానం

8 సెంటీమీటర్ల చాక్‌పీస్‌పై 60 సెకన్లలో 12 వినాయక విగ్రహాలు చెక్కడం ద్వారా కరీంనగర్‌కు చెందిన మాద్విక (14) గిన్నిస్

చాక్‌పీస్‌లపై విగ్రహాలు చెక్కడం ద్వారా రికార్డు

 కరీంనగర్ : 8 సెంటీమీటర్ల చాక్‌పీస్‌పై 60 సెకన్లలో 12 వినాయక విగ్రహాలు చెక్కడం ద్వారా కరీంనగర్‌కు చెందిన మాద్విక (14) గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సాధిం చింది. కరీంనగర్ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ పీక శశిధర్ కుమార్తె మాద్విక  గతేడాది నవంబర్ 24న తన ప్రతిభను ప్రదర్శిస్తూ గిన్నిస్ బుక్ రికార్డు కోసం దరఖాస్తు చేసుకుంది. ఆ సంస్థ ప్రతినిధులు బుధవారం ఆమెకు సర్టిఫికెట్ అందజేశారు. మాద్విక గతంలోనూ పలు రికార్డులు సాధించింది. ఈ చిన్నారి మాజీ డీజీపీ ప్రసాదరావు నుంచి నగదు పురస్కారాన్ని, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ చేతుల మీదుగా లిటిల్ బుక్ ఆఫ్ రికార్డు అందుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement