‘పాప’పు లోకాన్ని విడిచి వెళ్లింది | Just Born Baby Dead At Vikarabad District | Sakshi
Sakshi News home page

‘పాప’పు లోకాన్ని విడిచి వెళ్లింది

Feb 3 2020 4:26 AM | Updated on Feb 3 2020 4:26 AM

Just Born Baby Dead At Vikarabad District - Sakshi

మర్పల్లి: తనను కని చెత్తబుట్టలో పారేసిన ఈ పాడు లోకాన్ని చూడకుండానే ఓ పసికందు మృతిచెందింది. వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలం పంచలింగాలలో అప్పుడే పుట్టిన పసికందును గుర్తు తెలియని వారు ముళ్లపొదల్లో పడేసిన సంఘటన విదితమే. ఆ పసికందును ఓ కుక్క ఎత్తుకుపోతుండగా గుర్తించిన ఓ రైతు ఆ కుక్కను తరిమివేసి పాపను తీసుకున్నాడు. వెంటనే పోలీసుల సహాయంతో హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆస్పత్రికి తరలించారు. మూడు రోజులుగా చికిత్స పొందుతున్న ఆ పాప ఆదివారం మృతిచెందింది. మర్పల్లి ఎస్‌ఐ సతీశ్‌కుమార్‌ కేసు నమోదు చేసుకుని పంచనామా చేశారు. మృతదేహాన్ని హైదరాబాద్‌లోని మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement