breaking news
Just born baby
-
‘రెండుసార్లు’ జన్మించిన శిశువు! మెడికల్ మిరాకిల్
కొన్ని సంఘటనలు, అరుదైన వ్యాధులు విసిరే సవాళ్లు ఆధునిక వైద్యనికే అంతుచిక్కదు. ఒక్కోసారి ఆ సవాళ్లే కొంగొత్త వైద్య ఆవిష్కరణాలను నాంది పలికి..ఎందరినో ఆ అనారోగ సమస్యల నుంచి బయపడేసేందుకు దారితీస్తుంది. బతికే అవకాశాలు లేనప్పుడూ కూడా వైద్యానికే అందని విధంగా మిరాకిల్ జరిగి మరి జీవిస్తున్న ఎన్నో అద్భుతాలను చూశాం. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే ఘటన అంతకుమించిన మిరాకిల్ ఘటన. ఒక్కసారే ఎవ్వరైన జన్మిస్తాం..కానీ ఈ శిశువు ఏకంగా రెండుసార్లు జన్మించింది. బహుశా ఇదే వైద్యశాస్త్రంలోని అత్యంత అరుదైన ఘటనేమో..!.అసలేం జరిగిందంటే..2016లో ఒక అత్యంత అరుదైన కేసుని ఎదుర్కొన్నారు అమెరికా వైద్యులు. టెక్సాస్‌కి చెందిన మార్గరెట్ బోమర్ సాధారణ ప్రెగ్నెన్సీ చెకప్‌కి వెళ్లింది. ఎప్పటిలానే ఆరోజు పరీక్షలు చేయించుకుంది. స్కానింగ్ ఆమె గర్భంలోని శిశువు వెనుముక చివరలో శాక్రోకాక్సిజియల్ టెరాటోమా అనే అరుదైన కణితి అతుక్కుని ఉన్నట్లు గుర్తించారు వైద్యులు. దీని కారణంగా ఆ శిశువు మనుగడ సాగించడం కష్టమని తేల్చేశారు. ఎందుకంటే ఆ కణితి..పిండానికి అందాల్సిన రక్తాన్ని దారిమళ్లిస్తోంది. ఫలితంగా ఆ ఒత్తిడి గుండెపై పడి గుండె వైఫల్యానికి దారితీసే ప్రమాదిన్ని పెంచుతున్నట్లు తెలిపారు. అంటే ఆ శిశువు 26 వారాల రాక మునుపే గర్భంలో చనిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఆ విషయం తెలిసి ఆ మహిళ తీవ్ర ఆందోళనకు గురైంది. ఆమెకు ఇది అత్యంత భయాన ఉద్విగ్న క్షణం ఎందుకంటే. అసలు నిజానికి ఆమె గర్భంలో కవలలు పెరిగారు. అందులో ఒక శిశువు రెండో నెలలోనే గర్భస్రావం అయ్యింది. పోనీలే మరో శిశువు ఆరోగ్యంగా పెరుగుతోంది కదా అనుకుంటే ..మళ్లీ ఇలాంటి విషయం వినడంతో మరింతగా హడలిపోయింది మార్గరేట్. చాలామంది వైద్యులు గర్భం తొలగించుకోవాల్సిందే సూచించారు. ఎందుకంటే ఆ కణితిని అతి కష్టంపై సర్జరీ ద్వారా తొలగించినా..ఆ చిన్నారి బతికే అవకాశాలు 50% మాత్రమే అని తేల్చేశారు వైద్యలు. అయితే మార్గరేట్ ఆమె భర్త ఆమెను ఎలాగైనా బతికించుకోవాలనే నిర్ణయానికి వచ్చి.. టెక్సాస్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లోని ఒక ప్రత్యేక శస్త్రచికిత్స బృందాన్ని ఆశ్రయించారు. అక్కడ పిండం అభివృద్ధి చెందుతున్నప్పుడే..నేరుగా శస్త్ర చికిత్స చేసి..తిరిగి గర్భం కొనసాగేలా ఆ పిండాన్ని గర్భాశయంలోకి ప్రవేశపెట్టే ప్రమాదకరమైన ప్రక్రియ గురించి వైద్యలు ఆమెకు వివరించారు. 23 వారాల గర్భం నాటికే ప్రమాదం తీవ్రమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో..తక్షణమే గుండె పనితీరుని దెబ్బతీస్తున్న ఆ కణితిని తొలగించే సర్జరీ చేశారు. అరచేతిలో ఇమిడిపోయే అత్యంత చిన్న పిండాన్నే గాల్లో ఉంచే కణితిని తొలగించారు. చెప్పాలంటే..ఆపరేషన్ జరుగుతున్నంత సేపు గుండె ఆగిపోయింది. అయితే హార్ట్ సర్జన్ ఆ శిశువుని బతికించారు. ఆ శస్త్ర చికిత్స సమయంలోనే ఆక్సిజన్ని ప్లాసెంటా ద్వారా తల్లికి అనుసంధానించారు. అలా కణితిని తొలగించి..ఆ ఆడ శిశువుని తిరిగి గర్భంలోని ప్రవేశపెట్టి..శరీరంలో ద్రవాల సమతుల్యత పునరుద్ధరించి..గర్భాశయాన్ని పూర్తిగా కుట్టువేసి మూసివేశారు. అంతేగాదు మార్గరేట్ని కఠినమైన విశ్రాంతిలో ఉంచి ఆ శిశువు గర్భంలో ఆరోగ్యంగా పెరిగేలా చేశారు. అలా 36 వారాల అనంతరం రెండోసారి సీ సెక్షన్ ద్వారా ఆ శిశువుని బయటకు తీశారు. తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు నిర్థారించారు. ఆ చిన్నారి సుమారు 2.41 గ్రాముల ఆరోగ్యకరమైన బరువుతో ఉండటం విశేషం. ఆ చిన్నారి బయటకొచ్చిన ఎనిమిది రోజులకు వెన్నుముక చివరి ఎముక కణజాలన్ని శుభ్రం చేసేందుకు ఒక సాధారణ ఆపరేషన్ చేశారు. ఆ అద్భుత శిశువుకి లిన్లీ హూప్ అని పేరు పెట్టారు. సదరు తల్లి మార్గరేట్ మాత్రం ఇది అద్భుతమైన భయానక క్షణంగా పేర్కొంది. ఎందుకంటే క్షణం, క్షణం ఉత్కంఠ..బతికించుకోగలనా అన్న సందేహాల మధ్య సాగిన గర్భధారణ అని అంటోందామె.ఇదీ చదవండి: Shruti Haasan: ఎప్పటికీ తల్లిని కాలేననుకున్నా..!: శ్రుతి హాసన్ -
'ఓం'కి ఇంత పవర్ ఉందా? గుక్కపెట్టి ఏడుస్తున్న బిడ్డ కాస్తా..
పసిబిడ్డలు ఏడిస్తే సహజంగా ఏం చేస్తాం పాలు, లేదా డైపర్ వంటివి తనిఖీ చేస్తాం. ఒకవేళ అవి కాకపోతే భయపడ్డాడేమోనని దగ్గరకి తీసుకోవడం లేదా ఊయల్లో వేసి ఊపడం వంటివి చేస్తే ఆ పసివాడు ఏడుపు ఆపుతాడు. సహజంగా ఎవ్వరైనా ఇలానే చేస్తాం. కానీ ఈసారి నెట్టింట వైరల్ అవుత్తున్న వీడియోలో వ్యక్తి మాదిరి చేసి చూడండి. అంతేగాదు ఈ ఘటన మన ఆధ్యాత్మకి శక్తి గొప్పదనాన్ని చాటి చెప్పేలా ఉండటం విశేషం. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో క్లిప్‌లో ఒక తండ్రి ఏడుస్తున్న బిడ్డను పట్టుకుని ..నెమ్మదిగా ఓం శబ్దాన్ని ఆలపిస్తాడు. క్షణాల్లో బిడ్డ ఏదో మత్తువచ్చినట్లుగా శాంతించి నిద్రపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ చర్య పేరెంటింగ్ హ్యాక్‌గా మారింది. కఈ వీడియోకి మిలియన్లలో వ్యూస్ లైక్‌లు రావడమే గాక నెటిజన్ల మనసుని దోచుకుంది కూడా."ఓం" అనేది భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలలో లోతుగా పాతుకుపోయిన ఒక పవిత్రమైన మంత్రం. దీనికి భారతీయ ఆధ్యాత్మికత, యోగ సంప్రదాయాలలో "ఓం"కు సుదీర్ఘ చరిత్ర ఉంది, అక్కడ దీనిని మంత్రంగా, ధ్యానం చేసేటప్పుడు ఒక సాధనంగా ఉపయోగిస్తారు. అందువల్ల ఈ పద్ధతి భారతీయ తల్లిదండ్రులను అమితంగా ఆకర్షిస్తుంది. అయితే “ఓం” జపించడం వల్లనే శిశువు ఏడుపు ఆగిపోతుందనడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. కానీ లయబద్ధమైన శబ్దాలు, పునరావృతమయ్యే ఇంద్రియ అనుభూతి, కదలిక, సంరక్షకుని సాన్నిధ్యం వల్ల శాంతిని చేకూరుస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే ఈ ఓం మంత్రపై పరిశోధనలు పెద్దలపైనే జరిగాయి. ఫ్రాంటియర్స్ ఇన్ సైకాలజీలో 2022లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో, ధ్యానంలో ఎటువంటి అనుభవం లేని 33 మంది పెద్దలపై పరిశోధకులు అధ్యయనం చేశారు. ఓం జపం చేయడం వల్ల, వాళ్లలో ప్రతికూల భావాలు తగ్గడమే గాక ఆలోచన విధానంలో కూడా మంచి మార్పు వచ్చింది.పేరెంట్స్ ప్రయత్నించొచ్చా?తల్లిదండ్రులు గుర్తుంచుకోవలసిన అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, శిశువులలో కడుపునొప్పి, మితిమీరిన ఏడుపు లేదా నిద్ర సమస్యలను 'ఓం' నయం చేస్తుందనడానికి ఎలాంటి వైద్యపరమైన ఆధారాలు లేవు. అలాగే, ఈ ధ్వని శిశువు నాడీ వ్యవస్థపై ఒక ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతుంది అని చెప్పడానికి కూడా తగినంత ఆధారాలు కూడాలేవు.అయితే శిశువులు తమ సంరక్షకుల స్వరాలకు లయబద్ధమైన ఇంద్రియ అనుభవాలకు అత్యంత వేగంగా స్పందిస్తారు. అందువల్ల, ఈ "ఓం", శిశువులకు జోలపాట లేదా గుసగుసలు లేదా "ష్ష్ష్" వంటి ఊహించదగిన శ్రవణ సంకేతంగా పనిచేయవచ్చునని చెబుతున్నారు. ఆరోగ్యకరమైన శిశువు ఏడుపు ఆపడానికి ఇలాంటి "ఓం" టెక్నిక్‌ని అనుసరించడంలో సమస్యల లేదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. కానీ దీన్ని ఓ అద్భుత పరిష్కారంగా మాత్రం చూడొద్దని హెచ్చరిస్తున్నారు. View this post on Instagram A post shared by Siqueiros Bolado (@ck.bolado)గమనిక: ఇది కేవలం మత విశ్వాసాలకు సంబంధించిన అంశం. అలాగే కొన్ని శబ్దాలు సహజంగా ప్రభావం చూపిస్తాయని అవగాహన కల్పించేందుకు మాత్రమే. మరిన్ని వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించి అనుసరించడం మంచిది. (చదవండి: ఎవరీ యాల్డా మోయిరీ..? ఏకంగా 15 ఏళ్లు..) -
ప్లీజ్ పసిపిల్లలు ఏడవగానే అలా చేయొద్దు..!
ఎక్కువ మంది పేరెంట్స్ శిశువులు ఏడువగానే వెంటనే వారిని కంట్రోల్ చేయడానికి ప్యాసిఫైయర్ నోట్లో పెట్టేస్తుంటారు. దీంతో వెంటనే శిశువులు ఏడుపు మానేస్తారు. ఇది కొన్ని సందర్భాల్లో శిశువుకి, తల్లికి ఉపశమనం కలిగించినప్పటికీ.. అదే పనిగా ఉపయోగించడం మాత్రం అంతమంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ప్యాసిఫైయర్ నిత్యం సకింగ్ చేయడం వల్ల పిల్లల్లో దంతాల పెరుగుదలపై ప్రభావం పడుతుంది. పసివయసులో ఉపయోగిస్తే పెద్దగా సమస్య ఉండకపోయినా, 18 నెలల వయస్సు దాటిన తర్వాత కూడా వాడితే పళ్ల అమరిక దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ప్యాసిఫైయర్ను ఎక్కువగా ఉపయోగిస్తే చెవి ఇన్ఫెక్షన్లతోపాటు సకింగ్ వల్ల చెవి సంబంధిత నాళాలపై ఒత్తిడి పడుతుంది. రాత్రి వేళల్లో ప్యాసిఫైయర్ ఊడిపోగానే పిల్లలు ఏడుస్తుంటారు. ఇది పిల్లలతో పాటు తల్లిదండ్రుల నిద్రను కూడా డిస్టర్బ్ చేస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో వాడాల్సివచ్చినపుడు ఎప్పుడూ సింగిల్ పీస్వే ఎంచుకోవాలి. వాటిపై తేనె లేదా తియ్యటి పదార్థాలను రాయకూడదు. అలాగే వీటిని క్రమం తప్పకుండా స్టెరిలైజ్ చేస్తుండాలి. పగుళ్లు వస్తే వెంటనే మార్చేయాలి.ఇది ఒక ఆప్షనే కానీ తప్పనిసరి అవసరం కాదు. తల్లి పాలు ఇవ్వడం బాగా అలవాటైన తర్వాత అవసరమైతేనే ఉపయోగించాలి. పిల్లలు దీనిని సకింగ్ చేయడానికి ఇష్టపడకపోతే బలవంతంగా అలవాటు చేయడానికి ప్రయత్నించొద్దు. 12 నెలల వయస్సు దాటిన తర్వాత దీని వాడకాన్ని క్రమంగా తగ్గించడం శ్రేయస్కరం. (చదవండి: అధిక ప్రోటీన్ ఆహారంతో జస్ట్ 60 రోజుల్లో 22 కేజీలు..! సహాయపడిన డైట్ ఇదే..) -
Viral Video: ఇలా చేస్తారా..? పసి బిడ్డ ప్రాణాలతో చెలగాటం..!
-
కంగారు కేర్ గురించి విన్నారా..? తల్లులు తప్పక తెలుసుకోవాల్సింది..!
కంగారు తన పిల్లలను ఎలా సంరక్షిస్తుందో మనకు తెలుసు. అది తన శరీరంతో అతక్కునేలా బిడ్డను ఉంచుకుంటుంది. ఎక్కడకు వెళ్లినా వెన్నంటే బిడ్డను ఉంచుకుంటూ..అనుక్షణం రక్షించుకుంటుంది. ఇక్కడ తల్లులు నవజాత శిశువులను అలాగే సంరక్షించుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఇది తల్లి బిడ్డల అనుబంధానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అదీగాక సోషల్ మీడియాలో ఇది ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. తల్లి బిడ్డల అనుబంధానికి కంగారు మదర్ కేర్ ఏ విధంగా ఉపయోగపడుతుందో సవివరంగా చూద్దాం..!.అప్పుడే పుట్టిన శిశువు తల్లి పొత్తిళ్లలోని వెచ్చదనానికి హాయిగా నిద్రపోతుంది. అదీగాక ఈ ఉష్ణోగ్రత బిడ్డను పలు వ్యాధుల బారినపడకుండా ఉండేలా చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఇక్కడ కంగారు తన పిల్లలను తన పొట్ట మాదిరి సంచిలో చక్కగా ఉంచుకుని సంరక్షించుకుంటుంది. ఈ కేరింగ్ తక్కువ బరువుతో పుట్టే శిశువులకు ఆక్సిజన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. ఆహారం తీసుకునేలా చేస్తుంది. శిశువు పెరుగుదలకి, అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ప్రీమెచ్యూర్ బేబీలో ఈ కంగారు మదర్ కేరింగ్ విధానం పుట్టిన మొదటి ఆరు గంటల్లోనే కార్డియోస్పిరేటరీ సిస్టమ్‌లను స్థిరీకరిస్తుందని పరిశోధనలో తేలింది. అంతేగాదు ప్రపంచ ఆరోగ్య సంస్థ పుట్టిన వెంటనే కంగారు మదర్ కేర్(కేఎంసీ) ప్రారంభించడం వలన మరణాల రేటును తగ్గించవచ్చని పేర్కొంది. ఈ విధానాన్ని తొలిసారిగా అమెరికాలో బొగోటా వైద్యులు ప్రారంభించారు. ఇంక్యుబేటర్ కొరత, ఇన్ఫెక్షన్ల సమస్యకు పరిష్కారంగా ఈ విధానాన్ని తీసుకొచ్చారు వైద్యులు. ఈ కేరింగ్‌ల వల్ల కలిగే సత్ఫలితాలను చూసి అమ్మలు కచ్చితంగా ఈ విధానాన్ని పాటించేలా చేస్తున్నారు వైద్యలు. అంతేగాదు కొన్ని దేశాల్లో ఈ విధానాన్ని రోజువారీగా ఒక గంట పాటు చేయగా, మిగతా దేశాల్లో మాత్రం నిరంత సంరక్షణ చర్యగా ఈ విధానాన్ని అములు చేస్తారట. (చదవండి: టీచర్ కాస్త రేసర్‌గా..ఏకంగా నేషనల్ కారు రేసింగ్ ఛాంపియన్షిప్..!) -
‘పాప’పు లోకాన్ని విడిచి వెళ్లింది
మర్పల్లి: తనను కని చెత్తబుట్టలో పారేసిన ఈ పాడు లోకాన్ని చూడకుండానే ఓ పసికందు మృతిచెందింది. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం పంచలింగాలలో అప్పుడే పుట్టిన పసికందును గుర్తు తెలియని వారు ముళ్లపొదల్లో పడేసిన సంఘటన విదితమే. ఆ పసికందును ఓ కుక్క ఎత్తుకుపోతుండగా గుర్తించిన ఓ రైతు ఆ కుక్కను తరిమివేసి పాపను తీసుకున్నాడు. వెంటనే పోలీసుల సహాయంతో హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. మూడు రోజులుగా చికిత్స పొందుతున్న ఆ పాప ఆదివారం మృతిచెందింది. మర్పల్లి ఎస్ఐ సతీశ్‌కుమార్ కేసు నమోదు చేసుకుని పంచనామా చేశారు. మృతదేహాన్ని హైదరాబాద్‌లోని మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. -
రోడ్డు పక్కన పసికందు లభ్యం
టంగుటూరు (ప్రకాశం జిల్లా) : ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందును గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డు పక్కన వదిలేసి వెళ్లారు. ఇది గుర్తించిన స్థానికులు శిశువును చేరదీసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని శిశువును వైద్య చికిత్సల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
వాగులో పసికందు
-
వాగులో పసికందు
కందుకూరు అర్బన్ (ప్రకాశం) : అప్పుడే పుట్టిన పసికందును గుర్తుతెలియని వ్యక్తులు వాగులో పడేసి వెళ్లారు. రోడ్డు మీద వెళ్తున్నవారికి పాప ఏడుపు వినిపించడంతో.. వాళ్లు పాపను గుర్తించి ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కందుకూరు సమీపంలోని ఎర్రవాగు వద్ద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. కాగా.. ఆస్పత్రి వర్గాలు మాత్రం శనివారం రాత్రి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన దంపతులే ఈ పని చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.


