
జడ్జిని శపిస్తానంటూ బెదిరింపులు..
నిజామాబాద్ కోర్టులో బుధవారం వింత సంఘటన చోటుచేసుకుంది. ఓ కేసుకు సంబంధించి పరిహారం ఇచ్చే విషయంలో న్యాయమూర్తి చెప్పిన తీర్పును బాధితుడు అంగీకరించలేదు.
నిజామాబాద్ : నిజామాబాద్ కోర్టులో బుధవారం వింత సంఘటన చోటుచేసుకుంది. ఓ కేసుకు సంబంధించి పరిహారం ఇచ్చే విషయంలో న్యాయమూర్తి చెప్పిన తీర్పును బాధితుడు అంగీకరించలేదు. రూ.15 లక్షలకు బదులు రూ.5 లక్షల పరిహారం ఇస్తామనడటంతో బాధితుడు...పూనకంతో ఊగిపోతూ జడ్జిని శపిస్తానంటూ బెదిరింపులకు దిగాడు. బెదిరింపులకు దిగటంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.