ప్రియురాలు మోసగించిందని ఆత్మహత్యాయత్నం! | Jinxed lover attempted suicide in Warangal | Sakshi
Sakshi News home page

ప్రియురాలు మోసగించిందని ఆత్మహత్యాయత్నం!

Jul 23 2014 3:51 PM | Updated on Nov 6 2018 7:53 PM

ప్రియురాలు మోసగించిందనే కారణంతో ప్రియుడు ఆత్మాహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన వరంగల్ లో చోటు చేసుకుంది.

వరంగల్: ప్రియురాలు మోసగించిందనే కారణంతో ప్రియుడు ఆత్మాహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన వరంగల్ లో చోటు చేసుకుంది.  గత ఐదేళ్లుగా ఓ యువతికి రాజిరెడ్డి అనే యువకుడి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. 
 
తల్లితండ్రుల ఒత్తిడితో వేరే అబ్బాయితో నిశ్చితార్ధం చేసుకోవడంతో పురుగుల మందు తాగడానికి ముందు ప్రియుడి తల్లితండ్రులను నిలదీసినట్టు సమాచారం. రాజిరెడ్డి వ్యవహారంపై యువతి తల్లితండ్రులు సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.  
 
అయితే  అమ్మాయికి ఇష్టలేకపోతే.. బలవంతం చేయవద్దని రాజిరెడ్డిని పోలీసులు హెచ్చరించినట్టు తెలిసింది. దాంతో మనస్తాపం చెందిన రాజిరెడ్డి ఐదుపేజీల ప్రేమలేఖ రాసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. రాజిరెడ్డి పరిస్థితి విషమించడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement