breaking news
Jinx
-
శాపం ఉన్న నగరంలోకి నేడే యోగి అడుగు
సాక్షి, నోయిడా : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎట్టకేలకు నోయిడాలో అడుగుపెడుతున్నారు. ఇతర నాయకుల మాదిరిగా కాకుండా ఎలాంటి పునరాలోచన లేకుండా ధైర్యంగా ముందుకు వెళుతున్నారు. నోయిడాలో కొత్త మెట్రో రైలు సోమవారం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ కూడా హాజరు అవుతున్నారు. అయితే, నోయిడాకు శాపగ్రస్త పట్టణం అని పేరుంది. ఉత్తరప్రదేశ్ అధికారంలో ఉండి ఆ ప్రాంతంలో అడుగుపెట్టిన నేతకు తిరిగి అధికారం దక్కదని నానుడి. ఇది నిజమేనేమో అన్నట్లుగా మాయావతి కూడా ఈ నగరంలో అడుగుపెట్టి అధికారం కోల్పోయారు. మరోపక్క, అఖిలేష్ మాత్రం ఈ శాపానికి భయపడి అక్కడ అడుగుపెట్టలేదు. కానీ, యోగి మాత్రం వెళ్లాలనే నిర్ణయించుకున్నారు. మోదీ కూడా మెట్రో ప్రారంభానికి వస్తున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు పరిశీలించేందుకు యోగి నేడు నోయిడాలో అడుగుపెడుతున్నారు. దీంతోపాటు నేడే నోయిడా సిటీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించనున్నారు. యోగి వస్తున్న నేపథ్యంలో దాదాపు 1,500మంది పోలీసులను మోహరించారు. ఇక మోదీ వచ్చే రోజు మొత్తం 5000 మంది పారా మిలిటరీ బలగాలను ఉపయోగించనున్నారు. -
ప్రియురాలు మోసగించిందని ఆత్మహత్యాయత్నం!
వరంగల్: ప్రియురాలు మోసగించిందనే కారణంతో ప్రియుడు ఆత్మాహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన వరంగల్ లో చోటు చేసుకుంది. గత ఐదేళ్లుగా ఓ యువతికి రాజిరెడ్డి అనే యువకుడి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. తల్లితండ్రుల ఒత్తిడితో వేరే అబ్బాయితో నిశ్చితార్ధం చేసుకోవడంతో పురుగుల మందు తాగడానికి ముందు ప్రియుడి తల్లితండ్రులను నిలదీసినట్టు సమాచారం. రాజిరెడ్డి వ్యవహారంపై యువతి తల్లితండ్రులు సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే అమ్మాయికి ఇష్టలేకపోతే.. బలవంతం చేయవద్దని రాజిరెడ్డిని పోలీసులు హెచ్చరించినట్టు తెలిసింది. దాంతో మనస్తాపం చెందిన రాజిరెడ్డి ఐదుపేజీల ప్రేమలేఖ రాసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. రాజిరెడ్డి పరిస్థితి విషమించడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.