డీజీపీగా పదోన్నతి ఇవ్వకుంటే రాజీనామా

IPS Officer VK Singh Writes Letter To TS Government About His DGP Post - Sakshi

ప్రభుత్వానికి ఐపీఎస్‌ అధికారి వీకే సింగ్‌ లేఖ

సాక్షి, హైదరాబాద్‌:  సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి వినోయ్‌కుమార్‌ సింగ్‌ (వీకేసింగ్‌) మరోసారి వార్తల్లో నిలిచారు. అన్ని అర్హతలున్న తనకు డీజీపీగా పదోన్నతి కల్పించాలని, అలాకాని పక్షంలో తాను రాజీనామా చేసి వెళ్లిపోతానంటూ ప్రభుత్వానికి లేఖ ద్వారా విన్నవించారు. ప్రస్తుతం తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ అకాడమీ (టీఎస్‌పీఏ)కు డైరెక్టర్‌గా ఉన్న వీకే సింగ్‌ (ఏడీజీ) ఈనెల 21న ప్రభుత్వ సీఎస్‌కు లేఖ రాశారు. ఓ కాపీని సీఎం కేసీఆర్‌కు కూడా పంపిన ఆ లేఖలో ..1987 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన తనకు 33 ఏళ్లు సేవలందించిన అనుభవం ఉందని, తాను ఇప్పటికే డీజీపీ పోస్టు కోసం ఎంప్యానెల్‌ అయ్యానని, నిబంధనల ప్రకారం ఆ పదవికి తాను అన్ని విధాలా అర్హతలు కలిగి ఉన్నానని తెలిపారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top