ట్రంప్‌తో విందుకు సీఎం కేసీఆర్‌ | Invitation For KCR For Dinner With Donald Trump | Sakshi
Sakshi News home page

ట్రంప్‌తో విందుకు సీఎం కేసీఆర్‌

Feb 23 2020 1:10 AM | Updated on Feb 24 2020 2:01 PM

Invitation For KCR For Dinner With Donald Trump - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గౌరవార్థం ఈ నెల 25న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఈ విందులో పాల్గొనాల్సిందిగా సీఎం కేసీఆర్‌కు రాష్ట్రపతి కార్యాలయం ఆహ్వానం పంపింది. ఈమేరకు కేసీఆర్‌ మంగళవారం ఢిల్లీకి చేరుకుంటారు. కాగా, ట్రంప్‌ సోమ వారం ఉదయం అహ్మదాబాద్‌కు చేరుకుని ప్రధాని మోదీతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం ఆగ్రాలో తాజ్‌మహల్‌ను సందర్శించి ఢిల్లీకి చేరుకుంటారు. అనంతరం ఢిల్లీలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం రాష్ట్రపతి ఏర్పాటు చేసే గౌరవ ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు. 

Advertisement
 
Advertisement
Advertisement