బిడ్డను మార్చి ఇచ్చారు | Infant missing in RIMS Hospital | Sakshi
Sakshi News home page

బిడ్డను మార్చి ఇచ్చారు

Jun 8 2015 3:48 PM | Updated on Aug 17 2018 2:53 PM

బిడ్డ ఆరోగ్యం బాలేదని ఆస్పత్రికి తీస్కుని వెళ్తే.. బిడ్డను మార్చి ఇచ్చిన సంఘటన అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది.

ఆదిలాబాద్ : బిడ్డ ఆరోగ్యం బాలేదని ఆస్పత్రికి తీస్కుని వెళ్తే.. బిడ్డను మార్చి ఇచ్చిన సంఘటన అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... నాందేడ్ మండలం కిన్వత్ గ్రామానికి చెందిన ఆదివాసి దంపతులు వైశాలి, గజానంద్‌లకు మూడు రోజుల కిందట మగబిడ్డ జన్మించాడు. కాగా బాబు అనారోగ్యంతో ఉండటంతో వైద్యం చేయించుకోవడానికి ఆదివారం రిమ్స్‌కు వెళ్లారు. అయితే ఉదయం నుండి సాయంత్రం వరకు బాబును ఐసీయూలో ఉంచి.. సాయంత్రం మరో పిల్లాణ్ణి చేతికి ఇచ్చి పంపారు. ఈ బాబు మా బాబు కాదు అని తల్లిదండ్రులు నెత్తీ నోరు బాదుకున్నా వినకుండా.. వైద్య సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. దీంతో వారు సోమవారం ఉదయం రిమ్స్ చైర్మన్ చాంబర్ ముందు ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని ఆదివాసులంతా కలిసి ఆందోళన చేపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement