మురికి కాలువలో ఆడ శిశువు | infant found dead in canal | Sakshi
Sakshi News home page

మురికి కాలువలో ఆడ శిశువు

Nov 30 2015 4:47 PM | Updated on Aug 29 2018 4:18 PM

అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు మురికి కాలువలో పడేసిన హృదయ విదారక ఘటన నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలో సోమవారం వెలుగుచూసింది.

కొండమల్లెపల్లి (నల్లగొండ) : అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు మురికి కాలువలో పడేసిన హృదయ విదారక ఘటన నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలో సోమవారం వెలుగుచూసింది. స్థానిక ఆర్టీసీ క్వార్టర్స్ సమీపంలో మురికి కాలువలో శిశువు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఆస్పత్రికి తరలించారు. కాగా.. శిశువు తల భాగంలో గాయాలు ఉండటంతో  కుక్కలు, పందులు దాడి చేయడంతోనే శిశువు మృతిచెందివుంటుందని స్థానికులు అంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement