ఆసుపత్రిలో శిశువు మాయం: బంధువుల ఆందోళన | Infant baby theft at Gadwal hospital in Mahabubnagar district | Sakshi
Sakshi News home page

ఆసుపత్రిలో శిశువు మాయం: బంధువుల ఆందోళన

Apr 20 2014 9:57 AM | Updated on Sep 2 2017 6:17 AM

మహబూబ్నగర్ జిల్లా గద్వాల్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వారం క్రితం పుట్టిన శిశువును గత అర్థరాత్రి అదృశ్యమైంది.

మహబూబ్నగర్ జిల్లా గద్వాల్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వారం క్రితం పుట్టిన శిశువును గత అర్థరాత్రి అదృశ్యమైంది. దాంతో శిశువు తల్లితోపాటు బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. అపహరణకు గురైన శిశువును తమకు అప్పగించాలని ఆసుపత్రి సిబ్బందిని బంధువులు డిమాండ్ చేశారు. శిశువు అదృశ్యం వెనకు ఆసుపత్రి సిబ్బంది హస్తం ఉందని వారు ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శిశువు అదృశ్యంపై పోలీసులు ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement