భార్యాభర్తల దారుణ హత్య | Husbands and the assassination of | Sakshi
Sakshi News home page

భార్యాభర్తల దారుణ హత్య

Jul 1 2014 4:42 AM | Updated on Jul 10 2019 7:55 PM

భార్యాభర్తల దారుణ హత్య - Sakshi

భార్యాభర్తల దారుణ హత్య

తలపై మోది, గొంతుకు తాడు బిగించి భార్యాభర్తలను దారుణంగా హత్య చేసిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

చందానగర్ : తలపై మోది, గొంతుకు తాడు బిగించి భార్యాభర్తలను దారుణంగా హత్య చేసిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వాసు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలం పులుసుమామిడికిచెందిన సాదిక్ అలీ(55)కి ముగ్గురు భార్యలు. మొదటి భార్య సలీమా బేగం చనిపోయింది. ఆమెకు ముగ్గురు కుమారులు. రెండవ భార్య షమీమ్ బేగానికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు.  

పది సంవత్సరాల క్రితం జీడిమెట్లకు చెందిన వివాహిత ఆశాబీ(50)ని పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే ఆశాబీకీ ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. ఆశాబీతో కలిసి శేరిలింగంపల్లిలోని గోపీనగర్‌లో ఆరు నెలలుగా  నివాసం ఉంటూ ట్యాంకర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇది ఇలా ఉండగా 20 రోజుల క్రితం ఆశాబీతో కలిసి గ్రామానికి వెళ్లాడు. అక్కడి గొడవ జరగడంతో చిరిగిన దుస్తులతో భార్యాభర్తలు గోపీనగర్‌కు వచ్చారు.

ఆదివారం రాత్రి 11 గంటలకు నిద్రకు ఉపక్రమించారని ఇంటి యజమాని శాంతా యాయి తెలిపారు. తెల్లవారినా తలుపులు తెరవకపోవడంతో ఇంటి యజమాని తలుపులు తీసి చూడగా రక్తపు మడుగులో సాధిక్, ఆశాబీచనిపోయి ఉన్నారు. ఇద్దరి తలపై బలమైన వస్తువుతో కొట్టి చంపారని పోలీసులు తెలిపారు. తలపై కొట్టిన తరువాత గొంతుకు తాడుతో బిగించారు. చనిపోయారని నిర్థారించుకున్న తరువాత గుర్తు తెలియని దుండగులు ఉడాయించారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
 
ఆస్తి తగాదాలే కారణం?
 
ఇటీవల ఇల్లు అమ్మగా సాదిక్‌కు రెండు లక్షల రూపాయలు వచ్చాయని స్థానికులు తెలిపారు.  ఈ నేపథ్యంలో ఆస్తి తగాదాలు హత్యకు కార ణం కావచ్చని పోలీసులు భావిస్తునానరు. ఇత ర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు.  సంఘటన స ్థలాన్ని మాదాపూర్ డీసీపీ క్రాంతి రాణా టాటా, ఏసీపీ శ్రీధర్, సీఐ వాసు, క్లూస్ టీం సందర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement