భర్త ఇంటిఎదుట బైఠాయింపు | The Husband is The Woman of The House | Sakshi
Sakshi News home page

భర్త ఇంటిఎదుట బైఠాయింపు

Mar 26 2018 8:03 AM | Updated on Oct 9 2018 5:27 PM

The Husband is The Woman of The House - Sakshi

భవానికి మద్దతు తెలుపుతున్న మహిళలు

కాసిపేట(బెల్లంపల్లి) : మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలో తనకు న్యాయం చేయాలని రెండోపెళ్లి చేసుకున్న భర్త ఇంటిఎదుట మహిళ న్యాయపోరాటానికి దిగింది. రెండవ వార్డుకు చెందిన బోగె అంకుమల్లు, గౌరక్క దంపతుల కూతు రు భవాని, అదేగ్రామానికి చెందిన ముంతమల్ల స్వామి ప్రేమించుకున్నారు. ఒకేకులం వారు కావడంతో పెద్దల అంగీ కారంతో 2004లో వివాహం జరిపించారు. మొదటి ఏడాదిలో నే దంపతులకు కుమారుడు పుట్టి చనిపోయాడు. రెండోసారి మహిళ గర్భం దాల్చడంతో భర్త బలానికి ఇచ్చిన మాత్రలు వేసుకోవడంతో అబార్షన్‌ అయ్యింది. అప్పటి నుంచి మహిళకు వేధింపులు మొదలయ్యాయి. మూడేళ్లక్రితం తనతండ్రి చనిపోవడంతో ఇంటినుంచి వెళ్లగొట్టారు. అప్పటినుంచి ఇళ్లలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈవిషయమై గతంలో పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నడుస్తోంది. ఈక్రమంలో స్వామి బెల్లంపల్లికి చెందిన మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకుని భర్త ఇంటికి వెళ్లగా ఇంటినుంచి వెళ్లగొట్టారు. చిన్నతనంలోనే తల్లిచనిపోయిందని, మూడేళ్లక్రితం తండ్రి చనిపోయాడని ఎవరూ లేని నన్ను మోసంచేసి మరోపెళ్లి చేసుకున్నాడని మహిళ వాపోయింది. తనకు న్యాయం చేయాలని బాధిత మహిళ వేడుకుంటోంది.

Advertisement
 
Advertisement
Advertisement