భార్యపై భర్త హత్యాయత్నం | Husband attempts murder on Wife | Sakshi
Sakshi News home page

భార్యపై భర్త హత్యాయత్నం

Aug 21 2015 7:28 PM | Updated on Jul 30 2018 8:29 PM

ఓ వ్యక్తి భార్యను హతమార్చేందుకు యత్నించాడు.

జవహర్‌ నగర్ (రంగారెడ్డి) : ఓ వ్యక్తి భార్యను హతమార్చేందుకు యత్నించాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండలంలోని జవహర్ నగర్‌లో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... జవహర్ నగర్‌కు చెందిన శ్రీనివాస్, లావణ్యలు భార్యాభర్తలు. కాగా శుక్రవారం  వీరిద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో సహనం కోల్పోయిన శ్రీనివాస్, భార్యను కత్తితో పొడిచాడు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కాగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement