మిషన్ కాకతీయకు భారీగా విరాళాలు | huge donations for mission kakathiya | Sakshi
Sakshi News home page

మిషన్ కాకతీయకు భారీగా విరాళాలు

Mar 31 2015 4:59 PM | Updated on Sep 2 2017 11:38 PM

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ కాకతీయకు ఒక్క రోజే పెద్ద మొత్తంలో విరాళాలు అందాయి.

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ కాకతీయకు ఒక్క రోజే పెద్ద మొత్తంలో విరాళాలు అందాయి. క్రెడాయి ప్రతినిధి బృందం సీఎం కేసీఆర్ను కలిసి మిషన్ కాకతీయకు 50 లక్షల చెక్ను అందించారు. బీవీ రాజు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఛైర్మన్ విష్ణు రాజు సీఎంకి 50 లక్షల చెక్ని విరాళంగా ఇచ్చారు.

అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి రూ. 25 లక్షలు సీఎంకు ఇవ్వగా, మైన్స్ అండ్ జీయాలజీ ఉద్యోగులు తమ ఒక రోజు వేతనాన్ని మిషన్ కాకతీయ పనులకి విరాళంగా అందించారు. 

Advertisement
 
Advertisement
Advertisement