breaking news
mission kakathiya
-
మిషన్ భగీరథ దేశానికే ఆదర్శం
నాగర్‌కర్నూల్: మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అభిప్రాయ పడ్డారు. బిజినేపల్లి మండలం వెల్గొండ ఆవులకుంట చెరువులో మిషన్ కాకతీయ పనులను మంత్రి మంగళవారం ఉదయం ప్రారంభించారు. కూలీలతో పాటు మంత్రి జూపల్లి ట్రాక్టర్ వరకు మట్టి మోశారు. పూడికతీత పనుల్లో ఉపాధి కూలీలు పెద్ద ఎత్తున పాల్గొనడంపై మంత్రి వారిని అభినందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... మిషన్‌కాకతీయతో తెలంగాణ చెరువులకు పూర్వ వైభవం వచ్చిందన్నారు. -
పైలాన్‌ను పరిశీలించిన ఇరిగేషన్ అధికారులు
వరంగల్ : మిషన్ కాకతీయ పైలాన్‌ను ఆవిష్కరించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వస్తున్నారనే సమాచారం మేరకు సాగునీటి శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి, ఈఎన్సీ విజయప్రకాశ్, సీఈ నాగేందర్ శనివారం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు హన్మకొండలోని మైనర్ ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం ఆవరణలో నిర్మించిన మిషన్ కాకతీయ పైలాన్‌ను పరిశీలించారు. అనంతరం ఇరిగేషన్ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జోషి మాట్లాడుతూ పైలాన్ పరిసర ప్రాంతాలతో పాటు కార్యాలయ ఆవరణ మొత్తం పచ్చదనంతో కళకళలాడే విధంగా చర్యలు తీసుకోవాలని ఎస్ఈ శ్రీనివాస్‌రెడ్డిని ఆదేశించారు. ఆగస్టు 8వ తేదీన ప్రధాని పైలాన్ ఆవిష్కరణ కోసం వచ్చే అవకాశాలున్నాయన్నారు. ప్రధాని పర్యటన మరో వారం రోజుల్లో ఖరారవుతుందన్నారు. అనంతరం వారు హరితహారంలో భాగంగా కార్యాలయ ఆవరణలో మొక్కలను నాటారు. చెరువుల సందర్శన మిషన్ కాకతీయలో చేపట్టిన ¿¶ ద్రకాళి, బంధం చెరువుల అభివృద్ధి పనులను సాగునీటి శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి, ఈఎన్సీ విజయప్రకాశ్ పరిశీలించారు. అలాగే హసన్‌పర్తిలోని పెద్ద చెరువును కూడా వారు సందర్శిం చారు. కాగా, హసన్‌పర్తి చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే అరూరి రమేష్ ఉన్నతాధికారులను కోరారు. అనంతరం దేవాదుల ప్రాజెక్టు నిర్మాణంలో గత మూడేళ్లుగా ఆగిన ప్యాకేజీ–3 పనులను కూడా వారు పరిశీలించారు. అక్కడి నుంచి ధర్మసాగర్ పంప్‌హౌస్‌ను సందర్శించి హైదరాబాద్‌కు వెళ్లారు. దేవాదుల సీఈ వెంకటేశ్వర్లు, ఎస్ఈ శ్రీనివాస్‌రెడ్డి, డీఎస్ఈ శ్రవణ్, ఈఈలు గోపాలరావు, రత్నం, రాంగోపాల్, ఎన్టీపీఏ విశ్వంభరచారి, డీఈఈలు రఘుపతి, కిరణ్, పూర్ణచందర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
మిషన్ కాకతీయకు భారీగా విరాళాలు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ కాకతీయకు ఒక్క రోజే పెద్ద మొత్తంలో విరాళాలు అందాయి. క్రెడాయి ప్రతినిధి బృందం సీఎం కేసీఆర్‌ను కలిసి మిషన్ కాకతీయకు 50 లక్షల చెక్‌ను అందించారు. బీవీ రాజు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఛైర్మన్ విష్ణు రాజు సీఎంకి 50 లక్షల చెక్‌ని విరాళంగా ఇచ్చారు. అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి రూ. 25 లక్షలు సీఎంకు ఇవ్వగా, మైన్స్ అండ్ జీయాలజీ ఉద్యోగులు తమ ఒక రోజు వేతనాన్ని మిషన్ కాకతీయ పనులకి విరాళంగా అందించారు.