టీబీజీకేఎస్‌కు హెచ్‌ఎంఎస్‌ మద్దతు | HMS support for TBGCS | Sakshi
Sakshi News home page

టీబీజీకేఎస్‌కు హెచ్‌ఎంఎస్‌ మద్దతు

Sep 28 2017 2:10 AM | Updated on Sep 2 2018 4:16 PM

HMS support for TBGCS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి (టీబీజీకేఎస్‌) హిందూ మజ్దూర్‌ సభ (హెచ్‌ఎంఎస్‌) మద్దతు ప్రకటించింది. బుధవారం ఈ మేరకు జరిగిన సంఘం అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామని హెచ్‌ఎంఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

హెచ్‌ఎంఎస్‌కు అనుబంధంగా ఉన్న సింగరేణి మైనర్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ స్థానికంగా చీలిపోయిందని, ఆ యూనియన్‌ అధ్యక్షుడు వేణుగోపాలచారి టీబీజీకేఎస్‌కు మద్దతు ఇస్తున్నారన్నారు. అయితే ప్రధాన కార్యదర్శి ఒంటరిగా పోటీ చేస్తున్నారని తెలిపారు. కార్మికుల్లో నెలకొన్న సందిగ్ధతను తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. హెచ్‌ఎంఎస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శిని ఢిల్లీలో కలసి చర్చించామని నాయిని తెలిపారు. సింగరేణి ఎన్నికల్లో తనతో పాటు హెచ్‌ఎంఎస్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు టీబీజీకేఎస్‌కు ప్రచారం చేస్తామని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement