హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం | High Court judges sworn in | Sakshi
Sakshi News home page

హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం

Sep 22 2017 1:51 AM | Updated on Aug 31 2018 9:02 PM

High Court judges sworn in - Sakshi

హైకోర్టు న్యాయమూర్తులు గా ఆరుగురు ప్రమాణ స్వీకారం చేశారు. డీవీ ఎస్‌ఎస్‌ సోమయాజులు, కొంగర విజయలక్ష్మి,

ప్రమాణం చేయించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌
సాక్షి, హైదరాబాద్‌:
హైకోర్టు న్యాయమూర్తులు గా ఆరుగురు ప్రమాణ స్వీకారం చేశారు. డీవీ ఎస్‌ఎస్‌ సోమయాజులు, కొంగర విజయలక్ష్మి, పోట్లపల్లి కేశవరావు, మంతోజ్‌ గంగారావు, అభినంద్‌కుమార్‌ షావిలి, టి.అమర్‌నాథ్‌ గౌడ్‌లతో హైకోర్టులో జరిగిన కార్యక్రమంలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ ప్రమాణం చేయిం చారు. ఈ కార్యక్రమంలో ప్రమాణం చేసిన న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, బంధువు లు పాల్గొన్నారు.

అనంతరం వీరిని న్యాయవా దులు వ్యక్తిగతంగా కలసి అభినందించారు. ఈ ఆరుగురిని న్యాయమూర్తులుగా నియమి స్తూ రాష్ట్రపతి ఈ నెల 18న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రమాణం అనం తరం సీనియర్‌ న్యాయమూర్తులతో కలసి కేసు లు విచారించారు. తాత్కాలిక ప్రధాన న్యాయ మూర్తితో కలసి జస్టిస్‌ మంతోజ్‌ గంగారావు, జస్టిస్‌ రామసుబ్రమణియన్‌తో కలసి జస్టిస్‌ అభినంద్‌ కుమార్‌ షావిలి, జస్టిస్‌ సి.వి.నాగా ర్జునరెడ్డితో కలసి జస్టిస్‌ కొంగర విజయలక్ష్మి, జస్టిస్‌ పి.వి.సంజయ్‌కుమార్‌తో కలసి జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌గౌడ్, జస్టిస్‌ సురేశ్‌ కుమార్‌ కెయిత్‌తో కలసి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయా జులు, జస్టిస్‌ రాజా ఇలంగోతో కలసి జస్టిస్‌ కేశవరావులు కేసులను విచారించారు.

Advertisement
 
Advertisement
Advertisement