‘నాన్న’కు సాయం | Helping hand to the father | Sakshi
Sakshi News home page

‘నాన్న’కు సాయం

Aug 20 2017 12:26 AM | Updated on Sep 17 2017 5:42 PM

‘నాన్న’కు సాయం

‘నాన్న’కు సాయం

మానవత్వం పరిమళించింది. ‘మా నాన్నను.. ఆదుకోరూ..’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’ మెయిన్‌లో వచ్చిన కథనానికి దాతలు స్పందించారు.

ప్రకాశ్‌ కుటుంబానికి రూ.75 వేలు అందజేత
 
కోరుట్ల: మానవత్వం పరిమళించింది. ‘మా నాన్నను.. ఆదుకోరూ..’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’ మెయిన్‌లో వచ్చిన కథనానికి దాతలు స్పందించారు. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన ఎక్కల్‌దేవి ప్రకాశ్‌ స్వైన్‌ఫ్లూతో హైదరాబాద్‌ యశోద ఆస్పత్రిలో చేరారు. ‘చికిత్స కోసం రోజుకు రూ.లక్షకు మించి ఖర్చు వస్తోంది. మా ఆర్థిక పరిస్థితి బాగోలేదు.. ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలి’ అని ఆయన కుమా ర్తెలు వేడుకుంటున్నారు. ఈ విషయాన్ని సాక్షి’ వెలు గులోకి తీసుకురావడంతో దాతలు స్పందించి రూ. 75 వేల ఆర్థిక సాయాన్ని శనివారం వారికి అందించారు.

జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో విరాళాలు సేకరించి ప్రకాశ్‌ కూతుళ్లు మాధురి, లక్ష్మీప్రసన్నలకు అందించారు. ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి టీవీ శేఖర్‌ రూ.10 వేలు, వ్యాపారవేత్త మంచాల జగన్‌ రూ.5 వేలు, డాక్టర్‌ సుమన్‌ రూ.5 వేలు, శికారి రామకృష్ణ రూ.5 వేలు, మున్సిపల్‌ కమిషనర్‌ అల్లూరి వాణిరెడ్డి రూ.5 వేలు, టీఆర్‌ఎస్‌ నాయకులు సాయిని రవీందర్‌ రూ.5 వేలు సేకరించారు.

అలాగే, స్థానిక లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధులు ఎలిమిల్ల రాంనారాయణ రూ.5 వేలు, దావనపల్లి రాజలింగం రూ. 5 వేలు, గుంటక చంద్రప్రకాశ్‌ రూ.5 వేలు, రవూఫ్‌ రూ.5 వేలు, మీనా ఫుట్‌వేర్‌ గోపం రాజు రూ.5 వేలు, డాక్టర్‌ జగదీశ్వర్‌ రూ.2,500, చాప కిషోర్‌ రూ.2 వేలు, బాస రాజగంగాగారం రూ.2 వేలు, బండారి నర్సయ్య రూ.2 వేలు, కటుకం శంకర్‌ రూ.1,500, కొమ్ము జీవన్‌రెడ్డి రూ.1,500, పిడుగు గుణాకర్‌రెడ్డి రూ.1,500, వనపర్తి చంద్రమోహన్‌ రూ.1,000, పోతని ప్రవీణ్‌ రూ.1,000 అందించారు. మానవత్వంతో స్పందించి ఆర్థిక సాయం అందించిన దాతలకు ప్రకాశ్‌ కూతుళ్లు మాధురి, లక్ష్మీప్రసన్న, మనీషలు ధన్యవాదాలు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement