భారీ మూల్యం : అష్టకష్టాల్లో జిమ్ ఓనర్‌ దీపక్ | Gym owner Mohammad Deepak who defended shopkeeper faces financial ruin and eviction | Sakshi
Sakshi News home page

భారీ మూల్యం : అష్టకష్టాల్లో జిమ్ ఓనర్‌ దీపక్

May 26 2026 4:42 PM | Updated on May 26 2026 4:53 PM

Gym owner Mohammad Deepak who defended shopkeeper faces financial ruin and eviction

ఉత్తరాఖండ్‌లోని కోట్‌ద్వార్‌లో జిమ్ ట్రైనర్‌  మహ్మద్ దీపక్  గుర్తున్నారా? ఓ వృద్ధ ముస్లిం వ్యాపారిని వేధింపుల నుండి కాపాడి జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ దీపక్‌పై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీతోపాటు, అనేక ఇతర ప్రముఖులు, నేతలు కూడా ఆయనపై  ప్రశంసలు కురిపించారు.. ఆ సంఘటన జరిగిన కేవలం నాలుగు నెలలకే సర్వస్వం కోల్పోయే స్థితికి చేరుకున్నారు. అసలేం జరిగింది?  

 మానవత్వం చాటుకున్నందుకే ..ఇలా 
ఆ ప్రశంసలు మాట ఎలా ఉన్నా,ప్రస్తుతం ఆయన భారీ అప్పుల్లో మునిగిపోవడమే కాకుండా, తన జిమ్ వ్యాపారాన్ని కూడా కోల్పోయే ప్రమాదంలో పడ్డారు. మానవత్వాన్ని చాటుకున్నందుకు ఒకవైపు న్యాయపరమైన పోరాటం, మరోవైపు ఆర్థిక దివాలా అంచున ఉన్న కుమార్ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.  ఈ ఘటన తర్వాత కుమార్ తీవ్రమైన ఎదురుదెబ్బలను ఎదుర్కొన్నారు. అల్లర్లకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆయనపై ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదైంది. జిమ్ వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. గతంలో 150 మంది సభ్యులతో కళకళలాడే జిమ్‌కు, ఇప్పుడు రోజుకు కేవలం 15 మంది మాత్రమేపరిమితమైపోయింది. ఆర్థికంగా  చితికిపోయాడు. మతపరమైన విభజన కారణంగా కుమార్ ఒంటరివాడయ్యారు. గత నాలుగు నెలలుగా జిమ్ అద్దె చెల్లించలేక, అటు ఇంటి లోన్ ఈఎంఐలు (EMIs) కూడా నానా కష్టాలు పడుతున్నారు.

ఖాళీ చేయాలని నోటీసు
ప్రస్తుతం ఆర్థిక ఒత్తిడి తారస్థాయికి చేరిన వేళ, కుమార్ ఉంటున్న ఇంటి యజమాని ఆయనకు ఎగ్జిట్ (ఖాళీ చేయాలంటూ) నోటీసు ఇచ్చారు. అయితే ఇది కేవలం అద్దె బకాయిల కోసం ఇచ్చిన నోటీసు కాదని, ఆ వృద్ధ ముస్లిం వ్యాపారికి మద్దతుగా నిలిచినందుకు ప్రతికారంగానే తనను ఇల్లు ఖాళీ చేయిస్తున్నారని కుమార్ ఆరోపిస్తున్నారు. స్థానికంగా తనపై ఉన్న సామాజిక ముద్ర కారణంగానే వ్యాపారం చేసుకోలేకపోతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మతపరమైన అసహనానికి వ్యతిరేకంగా తాను తీసుకున్న నిర్ణయమే తన ప్రస్తుత దుస్థితికి కారణమని ఆయన వాపోతున్నారు.

ఇదీ చదవండి: రీవాల్యుయేషన్ వివాదం : ఎట్టకేలకు తప్పు ఒప్పుకున్న సీబీఎస్‌ఈ

కాగా ఈ ఏడాది జనవరి 26న కోట్‌ద్వార్‌లో 'కుమార్' అనే జిమ్ యజమాని, స్థానిక దుకాణదారుడైన వకీల్ అహ్మద్‌ను బజరంగ్ దళ్ సభ్యులు వేధించడాన్ని చూశారు. వకీల్ అహ్మద్ తన షాప్ పేరులో ఉన్న "బాబా" అనే పదాన్ని తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఆ పదం కేవలం స్థానిక దేవుడికి మాత్రమే పరిమితమని వారు వాదించారు. అయితే ఈవివాదంలో  కుమార్ జోక్యం చేసుకుని వృద్ధుడికి మద్దతుగా నిలిచారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో సహా పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు కుమార్ ధైర్యాన్ని, మత సామరస్య నిబద్ధతను అభినందించారు.

ఇదీ చదవండి: షాకింగ్‌ ఘటన : మృత్యువు ఇలా కూడా..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement