ఢిల్లీకి చెందిన 12వ తరగతి విద్యార్థి వేదాంత్ శ్రీవాస్తవ (Vedant Srivastava), తన రీ-వాల్యూయేషన్ ఫిజిక్స్ జవాబు పత్రం వేరే వారిది వచ్చిందని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇది వైరల్ అయ్యింది. దీనిపై స్పందించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) దీనిని సరిదిద్దే చర్యలు చేపట్టింది.
రీ-వాల్యూయేషన్ కోసం వేదాంత్ అప్లై చేయగా, బోర్డు తనకు పంపిన ఆన్సర్ షీట్ తనది కాదని, అది వేరే విద్యార్థి జవాబు పత్రమని అతను ఎక్స్ ద్వారా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాడు. ఈ విషయాన్ని వివరిస్తూ అతడు ఎక్స్‌లో పెట్టిన పోస్ట్‌లు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది.
I am a CBSE Class 12 student.
After receiving unexpectedly low marks in Physics, we applied for photocopies of my answer sheets through the CBSE reevaluation process.
Today we received the copies.
And I am shattered because the Physics answer sheet uploaded by CBSE is not mine— VEDANT (@VEDANTSHRIV17) May 23, 2026
తప్పు ఒప్పుకున్న సిబిఎస్‌ఇ (CBSE)
దీంతో సిబిఎస్‌ఇ అధికారికంగా రంగంలోకి దిగింది. తమ కొత్త ఆన్‌లైన్ స్క్రిప్ట్ మానిటరింగ్ (OSM) వ్యవస్థలో సాంకేతిక లోపాల కారణంగా ఇలాంటి గందరగోళం జరిగిందని బోర్డు అంగీకరించింది. వేదాంత్ కేసే కాకుండా, మరికొన్ని కేసుల్లో కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ పేపర్లు ఇలాగే పరస్పరం మారిపోయాయని బోర్డు స్పష్టం చేసింది. బాధిత విద్యార్థులందరి మార్కులను సరిదిద్దే ప్రక్రియ ప్రస్తుతం వేగంగా జరుగుతోందని సీబీఎస్‌ఈ తెలిపింది. సీబీఎస్‌ఈ జాయింట్ సెక్రటరీ (కోఆర్డినేషన్) స్వయంగా వేదాంత్‌కు ఈమెయిల్ ద్వారా లేఖ పంపారు. ఆ లేఖతో పాటు వేదాంత్ రాసిన అసలైన ఫిజిక్స్ ఆన్సర్ షీట్‌ను బోర్డు జత చేసింది.ఈ కొత్త మార్కుల ఆధారంగా , వెబ్‌సైట్‌లో త్వరలోనే అప్‌డేట్ చేస్తామని వివరణం ఇచ్చింది.
ఇదిలా ఉండగా, మరో 12వ తరగతి విద్యార్థిని సంజన కూడా, పునఃమూల్యాంకన ప్రక్రియలో అప్‌లోడ్ చేసిన కెమిస్ట్రీ జవాబు పత్రం తన చేతిరాతతో సరిపోలలేదని సోషల్ మీడియాలో ఆరోపించింది. తన వ్యక్తిగత వివరాలు ఉన్న మొదటి పేజీ తనదిగా కనిపించినప్పటికీ, లోపలి పేజీలు తన చేతిరాత శైలిని పోలి లేవని ఆమె పేర్కొంది. ఈ ఆరోపణలు, సీబీఎస్‌ఈ ఓఎస్ఎం (OSM) వ్యవస్థ అమలుపైనా, మూల్యాంకనం సమయంలో ఉపయోగించే డిజిటల్ స్కానింగ్, ట్యాగింగ్ ప్రక్రియల కచ్చితత్వంపైనా ఆందోళనలను తీవ్రతరం చేశాయి.
ఇదీ చదవండి: 66 హార్డ్ డిస్క్‌లు, లక్షల విలువైన డేటా మాయం : షాక్‌లో డైరెక్టర్లు


