భారీ వర్షం.. ఆరుగురిని రక్షించిన పోలీసులు | heavy rains in warangal district | Sakshi
Sakshi News home page

భారీ వర్షం.. ఆరుగురిని రక్షించిన పోలీసులు

Jun 24 2016 8:15 AM | Updated on Sep 4 2017 3:18 AM

వరంగల్ జిల్లా పాలకుర్తిలో గురువారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది.

వరంగల్: వరంగల్ జిల్లా పాలకుర్తిలో గురువారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గురువారం అర్ధరాత్రి దాటాక ఇస్నూరు కాజ్‌వే వద్ద ఓ వ్యాను వరదల్లో చిక్కుకు పోయింది. దీంతో స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఎస్సై వెంకటేశ్వర్లు తన బృందంతో వెళ్లి.. వ్యానులోని ఆరుగురు వ్యక్తులను రక్షించారు.

అలాగే భారీ వర్షంతోపాటు ఈదురు గాలుల కారణంగా మొండ్రాయి - స్టేషన్‌ఘన్‌పూర్ రహదారిలో పలుచోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. దీంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
 

Advertisement
 
Advertisement
Advertisement