సాక్షి ఆధ్వర్యంలో హరిత హారం.. | Haritha Haram In Warangal | Sakshi
Sakshi News home page

సాక్షి ఆధ్వర్యంలో హరిత హారం..

Aug 11 2018 1:58 PM | Updated on Aug 20 2018 8:24 PM

Haritha Haram In Warangal - Sakshi

మడిపల్లి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటుతున్న విద్యార్థులు

హసన్‌పర్తి : ‘సాక్షి’ దిన పత్రిక సౌజన్యంతో చేపట్టిన ‘గ్రీన్‌ చాలెంజ్‌’ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తోంది.  వారం రోజుల క్రితం హసన్‌పర్తి జిల్లా  పరిషత్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కుమార్‌ విసిరిన గ్రీన్‌ చాలెంజ్‌ సవాల్‌ను  ఎల్లాపురం పాఠశాల హెచ్‌ఎం విజయలక్ష్మీ, దేవన్నపేట పాఠశాల హెచ్‌ఎం ప్రేమానందరెడ్డి, మడిపల్లి పాఠశాల హెచ్‌ఎం రాజిరెడ్డి స్వీకరించారు.

ఈ మేరకు ఆయా పాఠశాలల్లో మొక్కలు నాటి.. ఒక్కొక్కరు మరో ముగ్గురికి గ్రీన్‌చాలెంజ్‌ సవాల్‌ విసిరారు. అనంతరం విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కో–ఆర్డినేటర్‌ విజయ్, సంగాల విక్టర్‌బాబు, చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి, బండి రజనీకుమార్, మణీంధర్‌నాథ్, పాడి రామకృష్ణారెడ్డి, రాజు, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement