మిషన్ కాకతీయపై మంత్రి హరీశ్‌రావు మంగళవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయపై మంత్రి హరీశ్‌రావు మంగళవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. చెరువు పునరుద్ధరణ పనులను జూన్‌లోగా పూర్తి చేయాల్సి ఉన్న దృష్ట్యా అధికారులు పనులను త్వరితగతిన ఆరంభించాలని, పూడిక మట్టిని ఎక్కువగా తీయడంపై దృష్టి సారించాలని సూచించారు. పూడిక నూర్పిళ్లకు ఉపాధి హామీతో అనుసంధానించే విషయమై రెండు, మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని మంత్రి తెలిపినట్లు సమాచారం.