అంతర్జాతీయ వండర్ బుక్ రికార్డ్స్‌లో జలాభిషేకం | Guru Purnima Sai Baba Temples Filled With Devotees In Hyderabad | Sakshi
Sakshi News home page

భక్తులతో కిటకిటలాడుతున్న సాయిబాబా ఆలయాలు

Jul 27 2018 7:41 AM | Updated on Sep 4 2018 5:53 PM

Guru Purnima Sai Baba Temples Filled With Devotees In Hyderabad - Sakshi

సాయిబాబాకు నారికేళ జలాభిషేకం చేస్తున్న భక్తులు

సాక్షి, విజయవాడ : గురుపౌర్ణమి పండుగ రోజు ముత్యాలం పాడు సాయిబాబా ఆలయం ఓ రికార్డుని నెలకొల్పింది. శుక్రవారం సాయిబాబా ఆలయంలో నిర్వహించిన లక్ష నారికేళ జలాభిషేకం ‘‘ అంతర్జాతీయ వండర్ బుక్ రికార్డ్స్’’లో చోటుసంపాదించుకుంది. ఈ నారికేళ జలాభిషేక కార్యక్రమానకి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు సైతం ఈ నారికేళ జలాభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. గురుపౌర్ణమి పండుగ రోజు బాబాను దర్శించుకోవటానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుంటున్నారు. 

భక్తులతో కిటకిటలాడుతున్న సాయిబాబా ఆలయాలు
హైదరాబాద్‌ : గురుపౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శుక్రవారం నగరంలోని అన్ని ప్రముఖ ఆలయాలకు భక్తుల రద్దీ పెరిగింది. సాయిబాబా దర్శనం కోసం ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ ఆలయాల్లో నేడు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయాల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement