‘కొండ’పై పెరిగిన భక్తుల రద్దీ | Growing up in the rush of devotees | Sakshi
Sakshi News home page

‘కొండ’పై పెరిగిన భక్తుల రద్దీ

Mar 7 2015 12:27 AM | Updated on Sep 2 2017 10:24 PM

‘కొండ’పై పెరిగిన భక్తుల రద్దీ

‘కొండ’పై పెరిగిన భక్తుల రద్దీ

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది.

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది. హోలీ సెలవు దినం స్వామివారి దర్శనం కోసం భక్తులు అధికసంఖ్యలో తరలిరావడంతో కొండపై రద్దీ పెరిగింది. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు, గర్భాలయం, క్యూలైన్లతోపాటు వసతి గదులు కూడా పూర్తిగా భక్తులతో నిండిపోయాయి.

50 ,150 రూపాయల క్యూలైన్లలో భక్తులు  బారులుదీరారు. గదులుదొరకని యాత్రీకులు దేవస్థానం ఏర్పాటు చేసిన షెడ్ల కింద సేదదీరారు. స్వామి వారి దర్శించుకోవడానికి సుమారు 6గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. సుమారు 30వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్టు ఆలయ అధికారులు పేర్కొన్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement