ఆగమనం! | Greater Warangal election | Sakshi
Sakshi News home page

ఆగమనం!

Feb 25 2016 1:09 AM | Updated on Mar 29 2019 9:31 PM

గ్రేటర్ వరంగల్ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి.

వరంగల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద వివిధ పార్టీల నాయకుల కోలాహలం
 
టీఆర్‌ఎస్‌లో టికెట్ల లొల్లిఅన్ని డివిజన్లలోనూ రెబల్స్..579 నామినేషన్లు దాఖలు 51 డివిజన్లకు అభ్యర్థుల ఖరారుఇంకా జాబితా ప్రకటించని కాంగ్రెస్ 54 డివిజన్లలోనే నామినేషన్లు 55 డివిజన్లలో బీజేపీ, 50 డివిజన్లలో టీడీపీ   రసవత్తరంగా గ్రేటర్ వరంగల్ ఎన్నికల పోరు.

వరంగల్ :  గ్రేటర్ వరంగల్ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. నామినేషన్ల దాఖలులోనే వరంగల్ ఎన్నికలు రికార్డు సృష్టించాయి. అన్ని పార్టీల తరఫున కలిపి మూడు రోజుల్లో మొత్తం 1350 నామినేషన్లు దాఖల య్యాయి. అన్ని పార్టీల్లోనూ ఒక్కో  డివిజన్‌కు ఒకరి కంటే ఎక్కువ మంది పోటీలో నిలిచారు. దీంతో తిరుగుబా టు అభ్యర్థులతో ఇబ్బందులు నెలకొన్నాయి. టీఆర్‌ఎస్‌కు ఈ సమస్య ఎక్కువగా ఉంది. గ్రేటర్ వరంగల్ ఎన్నికలు ఆపార్టీకి పెద్ద చిక్కులే తెచ్చిపెట్టాయి. కార్పొరేటర్ గా పోటీ చేసేవారు ఎక్కువగా ఉండడంతో టికెట్ల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. అధికార అభ్యర్థి ఒక్కరే ఉంటున్నా... తిరుగుబాటు అభ్యర్థుల బెడద టీఆర్‌ఎస్‌లో ఎక్కువగా ఉంది. నామినేషన్ల ఉపసంహరణలోపు ఈ తిరుగుబాట్లను అధిగమించడమే టీఆర్‌ఎస్‌కు పెద్ద సమస్యగా మారింది. ప్రతి డివి జన్‌లోనూ పోటీ అధికంగా ఉండడంతో టికెట్ ఎవరికి ఇవ్వా లో అనేది ఆ పార్టీ  నాయకత్వానికి తలనొప్పిగా మారింది. ఎమ్మెల్యేలతోనూ టికెట్ల పంపిణీ వ్యవహారం కొలిక్కి రాకపోవడంతో టీఆర్‌ఎస్ కీలక నేత టి.హరీశ్‌రావు స్వయంగా జిల్లా కు వచ్చి ఈ సమస్యను పరిష్కరిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో కలిసి గ్రేటర్ పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతూ టికెట్ల కేటాయింపు విషయాన్ని కొలిక్కి తెస్తున్నారు. గ్రేటర్ వరంగల్‌లో 58 డివిజన్లు ఉండ గా, టీఆర్‌ఎస్ 51 మంది అభ్యర్థుల జాబితాను వెల్లడించింది. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ వదిన స్వర్ణలతకు, రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి కోడలు అశ్రీతరెడ్డికి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ సోదరు డు విజయభాస్కర్‌కు టీఆర్‌ఎస్ టికెట్లు ఇచ్చింది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన గురువారం మరో ఏడుగురు పేర్లను ప్రకటించనుంది. అందరికీ అదే రోజు బీఫారం ఇవ్వనుంది. టీఆర్‌ఎస్ టికెట్ రాకపోవడంతో ఆయా డివిజన్లలో రెబల్‌గా పోటీ చేసిన వారిని ఒక్కొక్కరినీ పిలిచి సర్ది చెబుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఒక రోజు గడువు ఉండడంతో ప్రస్తుతం బుజ్జగింపులతోనే సరిపెడుతున్నారు. గడువు దగ్గరపడుతున్నా కొద్ది అన్ని రకాలుగా ప్రయత్నాలు పెంచేం దుకు సన్నద్ధమవుతున్నారు. దీని కోసం పోటీలో ఉన్న అభ్యర్థులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఎంత మంది టీఆర్‌ఎస్ తిరుగుబాటు అభ్యర్థులు పోటీలో ఉంటారో తేలనుంది.

బుజ్జగింపులు...
నామినేషన్ల దాఖలు గడువు బుధవారం ముగిసింది. శుక్రవారం ఉపసంహరణ ప్రక్రియ జరగనుంది. టీఆర్‌ఎస్ నుంచి భారీగా నామినేషన్లు వేయడంతో ఆ పార్టీలో గందరగోళం నెలకొంది. అన్ని డివిజన్లలోనూ రెబల్ అభ్యర్థులు బరిలో ఉండడంతో టీఆర్‌ఎస్ ముఖ్యనేత టి.హరీష్‌రావు అసంతృప్తులను బుజ్జగిస్తున్నారు. మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో ఉన్న హరీష్... డివిజన్ల వారీగా నాయకులను పిలిచి మాట్లాడుతున్నారు. అవసరమైన హామీలు ఇస్తూ నచ్చజెప్పుబుతున్నారు. కాగా, టీఆర్‌ఎస్ టికెట్ దక్కని వారి కోసం కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్‌కు సంబంధించి నాలుగు డివిజన్లలో ఒక్కరూ నామినేషన్ దాఖలు చేయలేదు. బీజేపీ మూడు, టీడీపీ ఎనిమిది డివిజన్లలో ఒక్క నామినేషన్ దాఖలు చేయలేదు. నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తయ్యాక గ్రేటర్ వరంగల్ రాజకీయం మరింత రసవత్తరంగా మారనుంది.
 
మేయర్ ఆశలపై నీళ్లు...
వారం క్రితం టీఆర్‌ఎస్‌లో చేరిన పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు సాధారణ ఎన్నికలకు ముందే టీఆర్‌ఎస్‌లో చేరారు. గ్రేటర్ మేయర్ పదవిని ఆశించిన ప్రదీప్‌రావు 26వ డివిజన్‌లో పోటీ చేయాలని భావించారు. టీఆర్‌ఎస్ ఈ డివిజన్ టికెట్‌ను గుండా ప్రకాశ్‌కు కేటాయించడంతో ప్రదీప్‌రావు 27వ డివిజన్‌లో నామినేషన్ దాఖలు చేశారు. ఈ డివిజన్‌లో టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. మేయర్ పదవి ఆశించిన మరో ఇద్దరు టీఆర్‌ఎస్ ముఖ్య నేతలకు కార్పొరేటర్ టికెట్లే దక్కలేదు. టీఆర్‌ఎస్ సీనియర్ నేతలు ఎం.సహోదర్‌రెడ్డి, మర్రి యాదవరెడ్డి 39వ డివిజన్ టికెట్ ఆశించారు. ఈ డివిజన్‌లో గెలిచి మేయర్ పదవి కోసం ప్రయత్నించాలని భావించారు. టీఆర్‌ఎస్ అధిష్టానం వీరిద్దరినీ పక్కనబెట్టి చీకటి ఆనంద్‌కు టికెట్ ఇచ్చింది. దీంతో సీనియర్ నేతలు ఖంగు తిన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement