మైనారిటీల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం | Sakshi
Sakshi News home page

మైనారిటీల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

Published Mon, Jun 27 2016 8:14 AM

మైనారిటీల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం - Sakshi

రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్
నగరంలో ఇఫ్తార్
►  హాజరైన ముస్లిం మతపెద్దలు, ప్రముఖులు

 
కరీంనగర్: మైనారిటీల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం నగరంలోని రెవెన్యూ గార్డెన్‌లో ముస్లింలకు ఇఫ్తార్ ఏర్పాటు చేశారు. సర్కస్ గ్రౌండ్‌లో ధావత్ ఇ-ఇఫ్తార్ చేపట్టారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడా రు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా ము స్లింల కోసం రంజాన్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఇఫ్తార్, ధావత్ ఇ-ఇఫ్తార్ ఏర్పాటుతోపాటు దుస్తులు అందజేస్తోందన్నా రు. మైనార్టీలకు నాణ్యమైన ఉచిత విద్య అం దించడానికి 73 గురుకులాలు ప్రారంభిస్తోందన్నారు.

హిందూ, ముస్లింలు సోదరభావంతో కలసిమెలసి ఉండాలని కోరారు. జెడ్పీ చైర్‌పర ్సన్ తుల ఉమ, కలెక్టర్ నీతూప్రసాద్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎస్పీ జోయల్ డేవిస్, కరీంనగర్ ఎంపీపీ వాసాల రమేశ్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మహ్మద్ అరిఫ్ అహ్మద్, నాయకులు ఎస్‌కే యూసుఫ్, కట్ల సతీష్, డెప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. కాగా, న్యూపీకాక్ హోటల్‌లో జమాతే ఇస్లాం హింద్ ఆధ్వర్యంలో ఇచ్చిన ఇఫ్తార్‌లో జిల్లా జడ్జి నాగమారుతీశర్మ, జమాతే ఇస్లాం హింద్ నగర అధ్యక్షుడు ఖైరొద్దీన్, బాధ్యులు మహ్మద్ అఫ్జల్, వాజిద్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement