గోదావరిఖని కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆత్మహత్య | Godavarikhani Congress leader commits suicide | Sakshi
Sakshi News home page

గోదావరిఖని కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆత్మహత్య

May 25 2015 6:03 PM | Updated on Mar 18 2019 7:55 PM

కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలోని మార్కండేయకాలనీలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షురాలు బర్ల స్వరూప(42) క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.

గోదావరిఖని : కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలోని మార్కండేయకాలనీలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షురాలు బర్ల స్వరూప(42) క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే.. గోదావరిఖని కాంగ్రెస్ పట్టణ శాఖ అధ్యక్షురాలు స్వరూప అదే పార్టీకి చెందిన గుణవతి అనే మహిళా కార్యకర్తకు కొంత డబ్బు అప్పుగా ఇచ్చింది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో చిట్టీల డబ్బులు కూడా ఇచ్చింది.  అయితే ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని పలుమార్లు కోరినా ఇవ్వకపోవటంతో సోమవారం గుణవతి ఇంటికి వెళ్లి డబ్బు ఇవ్వకపోతే విషం తాగుతానని బెదిరించింది. ఈ క్రమంలో అందరూ చూస్తుండగానే తనతోపాటు తెచ్చుకున్న క్రిమిసంహారక మందును ఒక్కసారిగా తాగేసింది. స్థానికులు హుటాహుటిన స్వరూపను దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుండి ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్వరూప మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement