రెండోరోజూ ప్రియురాలి నిరసన | Girl protests for justice in front of boyfriend's house in vemulapalli village | Sakshi
Sakshi News home page

రెండోరోజూ ప్రియురాలి నిరసన

Mar 2 2015 2:32 AM | Updated on Sep 2 2017 10:08 PM

ప్రేమించి మోసగించిన వ్యక్తితోనే తనకు పెళ్లి జరిపించి న్యాయం చేయాలని ఓ ప్రియురాలు ప్రియుడి ఇంటిముందు చేపట్టిన నిరసన రెండోరోజుకు చేరింది.

శెట్టిపాలెం (వేములపల్లి) ప్రేమించి మోసగించిన వ్యక్తితోనే తనకు పెళ్లి జరిపించి న్యాయం చేయాలని ఓ ప్రియురాలు ప్రియుడి ఇంటిముందు చేపట్టిన నిరసన రెండోరోజుకు చేరింది. మండలంలోని శెట్టిపాలెం గ్రామానికి చెందిన పెదమాం రమణ ఇదే గ్రామానికి చెందిన ప్రియుడు నక్క విఘ్నేష్ ఇంటి ముందు శనివారం ఉదయం బైఠాయించింది. తనకు విఘ్నేష్‌తో వివాహం జరిపించనిదే  ఆందోళనను విరమించబోనని స్పష్టం చేసింది. రెండో రోజు ఆదివారం కూడా విఘ్నేష్ ఇంటి ఎదుట కుటుంబ సభ్యులు, బంధువులతో కలసి బైఠాయించి నిరసన తెలిపింది.
 
 డీఎస్పీ విచారణ
 మిర్యాలగూడ డీఎస్పీ సందీప్ గోనె ఆదివారం శెట్టిపాలెం గ్రామానికి చేరుకొని బాధితురాలు పెదమాం రమణను విచారించి వివరాలు నమోదు చేసుకున్నారు. రమణతో పాటు తల్లిదండ్రులు, బంధువులను విచారించి వివరాలను సేకరించారు. అదేవిధంగా పోలీస్‌స్టేషన్‌లో ప్రియుడు నక్క విఘ్నేష్‌తో పాటు అతని తల్లిదండ్రుల నుంచి వాంగ్మూలాన్ని సేకరించారు. డీఎస్పీ వెంట మిర్యాలగూడ రూరల్ సీఐ కోట్ల నర్సింహారెడ్డి, ఎస్‌ఐ విజయ్‌కుమార్ ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement