breaking news
boyfriends house
-
ప్రియుడి ఇంటి ముందు యువతి ఆందోళన
-
ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు మౌనపోరాటం
-
ప్రియుడు ఇంటిముందు ప్రియురాలు ఆత్మహత్య
అనంతపురం : ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన అనంతపురం జిల్లా యాడికి మండలం కమలపాడులో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.... శివ, కమలమ్మ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఆ క్రమంలో ఇద్దరు కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. అయితే శివకి పెళ్లయింది. ఆ విషయం తెలిసిన కమలమ్మ తరచు శివతో ఘర్షణకు దిగేది. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. దాంతో ఎవరికి వారు విడిగా ఉంటున్నారు. కాగా శుక్రవారం ఉదయం శివ ఇంటికి ముందు కమలమ్మ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ప్రియుడు శివ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కమలమ్మ మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. -
రెండోరోజూ ప్రియురాలి నిరసన
శెట్టిపాలెం (వేములపల్లి) ప్రేమించి మోసగించిన వ్యక్తితోనే తనకు పెళ్లి జరిపించి న్యాయం చేయాలని ఓ ప్రియురాలు ప్రియుడి ఇంటిముందు చేపట్టిన నిరసన రెండోరోజుకు చేరింది. మండలంలోని శెట్టిపాలెం గ్రామానికి చెందిన పెదమాం రమణ ఇదే గ్రామానికి చెందిన ప్రియుడు నక్క విఘ్నేష్ ఇంటి ముందు శనివారం ఉదయం బైఠాయించింది. తనకు విఘ్నేష్‌తో వివాహం జరిపించనిదే ఆందోళనను విరమించబోనని స్పష్టం చేసింది. రెండో రోజు ఆదివారం కూడా విఘ్నేష్ ఇంటి ఎదుట కుటుంబ సభ్యులు, బంధువులతో కలసి బైఠాయించి నిరసన తెలిపింది. డీఎస్పీ విచారణ మిర్యాలగూడ డీఎస్పీ సందీప్ గోనె ఆదివారం శెట్టిపాలెం గ్రామానికి చేరుకొని బాధితురాలు పెదమాం రమణను విచారించి వివరాలు నమోదు చేసుకున్నారు. రమణతో పాటు తల్లిదండ్రులు, బంధువులను విచారించి వివరాలను సేకరించారు. అదేవిధంగా పోలీస్‌స్టేషన్‌లో ప్రియుడు నక్క విఘ్నేష్‌తో పాటు అతని తల్లిదండ్రుల నుంచి వాంగ్మూలాన్ని సేకరించారు. డీఎస్పీ వెంట మిర్యాలగూడ రూరల్ సీఐ కోట్ల నర్సింహారెడ్డి, ఎస్ఐ విజయ్‌కుమార్ ఉన్నారు.