మా బాహుబలి జానా, ఉత్తమ్‌ | geetha reddy comments on bahubali | Sakshi
Sakshi News home page

మా బాహుబలి జానా, ఉత్తమ్‌

Mar 22 2017 3:10 AM | Updated on Sep 19 2019 8:44 PM

మా బాహుబలి జానా, ఉత్తమ్‌ - Sakshi

మా బాహుబలి జానా, ఉత్తమ్‌

తమ పార్టీకి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డిలే బాహుబలి అని ఆ పార్టీ ఎమ్మెల్యే గీతారెడ్డి వ్యాఖ్యానించారు.

సాక్షి, హైదరాబాద్‌: తమ పార్టీకి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డిలే బాహుబలి అని ఆ పార్టీ ఎమ్మెల్యే గీతారెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం విలేకరులతో ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీకి చాలా బలముందని, ఇతర పార్టీల నుంచి బాహుబలి రావాల్సిన అవసరం లేదన్నారు. గత ప్రభుత్వాల్లో మీడియా ప్రతినిధులు అసెంబ్లీ అం తటా కనిపించేవారని, ఇప్పుడెందుకు కనిపించడంలేదన్నారు.

కాంగ్రెస్‌ కుస్తీ పార్టీకాదు: మల్లు రవి
బాహుబలిలు ఎవరైనా ఉంటే సినిమాల్లోకి లేదా కుస్తీపోటీలకు పోతే మంచిదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి వ్యాఖ్యానించారు.  కాంగ్రెస్‌ పార్టీ కుస్తీల పార్టీ కాదని, రాజకీయాల్లో బాహుబలికి స్థానం లేదన్నారు. నెహ్రూ, ఇందిరాగాంధీ, వైఎస్‌ రాజశే ఖరరెడ్డి వంటివారంతా ప్రజల నాయకులు అని, వారంతా బాహుబలిలు కాదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement