హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం | gas cylinder blast in nampally bazarghat on sunday | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం

Mar 15 2015 7:30 PM | Updated on Apr 3 2019 3:52 PM

హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం - Sakshi

హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం

నగరంలోని ఓ ఏరియాలో సిలిండర్ పేలడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు.

హైదరాబాద్ :నగరంలో ఆదివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నాంపల్లిలో ఓ కార్ల్ షెడ్ లో సిలిండర్ పేలిన ఘటన భారీ ప్రమాదానికి దారి తీసింది. వివరాలు... నాంపల్లిలోని బజార్ఘాట్లో ఓ కార్ల షెడ్ లో గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు చుట్టుముట్టాయి.

 

గ్యాస్ సిలిండర్ పేలుడుతో భారీగా శబ్ధం రావడంతో ప్రజలు భయందోళనలకు గురయ్యారు. ఘటనాస్థలానికి 15 ఫైరింజన్లతో పాటు 20 వాటర్ ట్యాంకర్లను తరలించారు. ప్రస్తుతం సహాయక చర్యలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఘటనా స్థలికి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డితో పాటు సీపీ మహేందర్ రెడ్డిలు సందర్శించారు.ముందస్తు జాగ్రత్తగా నాంపల్లి ప్రాంతంలో కరెంట్ సరఫరా నిలిపివేశారు.నాంపల్లి- మాసబ్ ట్యాంక్ మధ్య భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ ను ఆసిఫ్ నగర్ మీదుగా మల్లించే యత్నం చేస్తున్నారు. ఒక షెడ్డులోని 20 పైగా సిలిండర్లు పేలాయి. షెడ్డులోని సామాన్లు దగ్ధమయ్యాయి. సిబ్బంది కొరతతోనే ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు వాపోతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement