రోడ్డుప్రమాదంలో నలుగురికి గాయాలు | four injured in warangal road accident | Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాదంలో నలుగురికి గాయాలు

Jan 10 2016 11:37 PM | Updated on Aug 30 2018 3:58 PM

వరంగల్ జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు.

మంగపేట: వరంగల్ జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. మంగపేట గంపోనిగూడెం సమీపంలో ఓ కారు గోతిలో పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వెంకట్‌రెడ్డి, అతని భార్య నాగేశ్వరి, కుమారులు భార్గవ్, సాయి కిరణ్‌లు గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం జిల్లా అశ్వాపురం వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మణుగూరు వైపు నుంచి వస్తున్న ఇసుక లారీని తప్పించే క్రమంలో కారు ముందున్న గోతిలో పడింది. పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని తీవ్రంగా గాయపడిన నాగేశ్వరిని 108 వాహనంలో ఏటూరు నాగారం ఆస్పత్రికి తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement