బతుకు పోరాటం సాగించిన సారిక


కోర్టుకు హాజరైన మరుసటి రోజే మృతి

అడుగడుగునా ఇబ్బంది పెట్టిన భర్త అనిల్

 


వరంగల్ లీగల్ : వైవాహిక జీవితంలో అవమానాలు, మానసిక, శారీరక హింస ఎదుర్కొన్న మాజీ ఎంపీ సిరిసిల్ల రాజ య్య కోడలు సారిక.. ఆమెతో పాటు పిల్లలు బతకడానికి జీవనభృతి సాధిం చేందుకు కడదాక పోరాడింది. అయితే, ఈ న్యాయ పోరాటంలో ఆమెకు భర్త అని ల్ అడుగడుగునా అడ్డంకులు సృష్టిం చాడు. చివరకు కేసు వాయిదా కోసం ఈనెల 2న సారిక, అనిల్ జిల్లా కోర్టు ప్రాంగణంలోని నాలుగో అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యా రు. ఆ మరుసటి మరుసటి రోజే ఆమె పిల్లలతో కలిసి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం గమనార్హం. భర్త అనిల్, అత్తమామలు మాధవి, రాజయ్య మానసికంగా శారీరకంగా హింసిస్తున్నారని, పిల్లలకు సైతం భోజనం, విద్య, వైద్య వంటి కనీస అవసరాలుకల్పించకుండా వేధిస్తున్నారని సారిక ఫిర్యాదు మేరకు గృహహింస చట్టం కింద 2014 జూన్ 14న నాలుగో మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు లో కేసు నెంబర్ 6/2014 నమోదైంది. తనను వేధించకుండా చూడడంతో పా టు రెవెన్యూకాలనీలోని ఇంటి నుంచి పం పించకుండా చూడాలని, తన నుంచి అత్తమామలు తీసుకున్న 20 తులాల బంగా రం, 10 లక్షల నగదు ఇప్పించడంతో పా టు రూ.50లక్షల పరిహారం ఇప్పించాలని కోరుతూ ఆమె ఈ కేసు వేసింది.ఈ క్రమంలోనే 2015 జనవరి 13న సారికకు నెలకు రూ.6వేలు, పిల్లలు ముగ్గురికి రూ.3వేల చొప్పున మొత్తం రూ.15వేలు పోషణ నిమిత్తం అనిల్ చెల్లించాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, దీనిపై తనకు ఆదాయ వనరులు లేవంటూ అనిల్ జిల్లా కోర్టులో అప్పీల్ చేయగా.. ఆ అప్పీల్‌ను కోర్టు కొట్టివేసింది. తండ్రి రాజయ్య మాజీ ఎంపీ, తల్లి మాధవి అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నందున రూ.15వేలు చెల్లించడం సాధ్యమేనని జడ్జి రేణుక ఆ తీర్పులో పేర్కొన్నారు. అయినా జనవరి నుంచి జూలై 2015వరకు అనిల్ డబ్బు ఇవ్వకపోగా సారిక మళ్లీ కోర్టును ఆశ్రయించడంతో ఏడు నెలల డబ్బులో రూ. 45వేలు చెల్లించాడు. అయితే, తనకు భృతి చెల్లించకుండా వేధిస్తున్న భర్త అని ల్‌ను అరెస్టు చేయాలని కోర్టుకు విన్న విం చిన సారిక విచారణ నిమిత్తం సోమవా రం కోర్టుకు హాజరైంది. మరుసటి రోజు మంగళవారం అర్ధరాత్రి బుధవారం తెల్లవారుజామున అనుమానస్పద స్థితిలో పిల్లలతో సహా మృతి చెందింది. ఇలా తన హక్కుల సాధనకు నిరంతరం నిర్భయంగా నిలబడి న్యాయపోరాటం సాగిం చిన సారిక మరణం హత్యా? ఆత్మహ త్యా? అనేది మాత్రం తేలాల్సి ఉంది.

 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top