బేగంపేటలోని ఓ షాపులో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని షాపు నిర్వాహకులు తెలిపారు.
బేగంపేటలో ఓ షాపులో అగ్నిప్రమాదం
Jul 20 2014 1:40 PM | Updated on Sep 5 2018 9:45 PM
హైదరాబాద్: బేగంపేటలోని ఓ షాపులో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని షాపు నిర్వాహకులు తెలిపారు.
ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించిందని.. సకాలంలో మూడు ఫైరింజన్లు వచ్చి మంటల్ని ఆర్పివేసాయని బేగంపేట పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ జీ బస్వారెడ్డి తెలిపారు. ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని ఆయన తెలిపారు.
షాట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం సంభవించిందని పోలీసులు అన్నారు. గత మూడు నెలల క్రితం ఇదే భవనంలోని మూడవ ఫ్లోర్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement