హోండా షోరూంలో భారీ అగ్నిప్రమాదం | Fire Accident in Honda Showroom warangal | Sakshi
Sakshi News home page

హోండా షోరూంలో భారీ అగ్నిప్రమాదం

May 12 2017 8:45 AM | Updated on Sep 5 2018 9:47 PM

నగరంలోని ఎంజీఎం చౌరస్తా సమీపంలోని హోండా షోరూంలో గురువారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

వరంగల్‌: నగరంలోని ఎంజీఎం చౌరస్తా సమీపంలోని హోండా షోరూంలో గురువారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గ్రీన్‌ హోండా షోరూంలో  ప్రమాదవశాత్తు మంటలు ఎగిసిపడటంతో.. 10 కొత్త కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటాన్ని గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

సంఘటనా స్థలానికి చేరకున్న ఫైర్‌ సిబ్బంది నాలుగు ఫైరింజన్ల సాయంతో మంటలు ఆర్పేందుకు నాలుగు గంటలపాటు శ్రమించారు. ఈ ప్రమాదంలో 10 కార్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. వాటి విలువ సుమారు రూ. 50 లక్షల వరకు ఉంటుందని అంచనా. షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement