15 వందల క్వింటాళ్ల పత్తి దగ్ధం | Fire accident in Ginning mill | Sakshi
Sakshi News home page

15 వందల క్వింటాళ్ల పత్తి దగ్ధం

Dec 22 2015 6:27 PM | Updated on Sep 5 2018 9:45 PM

నేరేడుగొండ మండలకేంద్రంలోని జగదాంబ జిన్నింగ్ మిల్లులో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది.

నేరేడుగొండ (ఆదిలాబాద్ జిల్లా) : నేరేడుగొండ మండలకేంద్రంలోని జగదాంబ జిన్నింగ్ మిల్లులో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి 15 వందల క్వింటాళ్ల పత్తి దగ్ధమైంది. సుమారు రూ.65 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు అంచనా. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement