టీఆర్‌ఎస్, టీడీపీ శ్రేణుల డిష్యుం.. డిష్యుం | fight between trs,tdp | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్, టీడీపీ శ్రేణుల డిష్యుం.. డిష్యుం

Apr 9 2014 3:33 AM | Updated on Oct 30 2018 7:30 PM

ఎన్నికల ప్రచారంలో ఎదురుపడిన టీఆర్‌ఎస్, టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఘర్షణకు దిగిన సంఘటన మండలంలోని వెంకటాపూర్‌లో మంగళవారం ఉదయం జరిగింది.

వెంకటాపూర్(జఫర్‌గఢ్), న్యూస్‌లైన్ : ఎన్నికల ప్రచారంలో ఎదురుపడిన టీఆర్‌ఎస్, టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఘర్షణకు దిగిన సంఘటన మండలంలోని వెంకటాపూర్‌లో మంగళవారం ఉదయం జరిగింది.

ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వివరాలిలా ఉన్నారుు. టీఆర్‌ఎస్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపు కోసం కడియం శ్రీహరితోపాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు వెంకటాపూర్‌లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. అదే సమయంలో గ్రామంలో టీడీపీ అభ్యర్థుల గెలుపు కోరుతూ ఆ పార్టీ నేత కట్టా మనోజ్‌రెడ్డి తమ కార్యకర్తలు, అభ్యర్థులతో ప్రచారం నిర్వహిస్తున్నారు.
 
ఇంటింటా ప్రచారం నిర్వహించిన కడియం శ్రీహరి గ్రామ ప్రధాన సెంటర్‌లో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుండగా అదే సమయంలో అక్కడికి చేరుకున్న టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కట్టా మనోజ్‌రెడ్డి, ఆ పార్టీ శ్రేణులు ప్రసంగానికి అడ్డు తగిలారు. టీడీపీ అభ్యర్థులను గెలిపించాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఇరుపార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఒకరిపై మరొకరు దూసుకొచ్చి చొక్కలు పట్టుకొని ఘర్షణకు దిగారు.
 
దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సుమారు రెండు గంటలపాటు ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కట్టా మనోజ్‌రెడ్డి తీరుపై కడియం శ్రీహరితో పాటు ఆ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా టీడీపీ శ్రేణులు వెనక్కి తగ్గకపోవడంతో ఇరుపార్టీల మధ్య  మాటల యుద్ధంతో కొట్టుకునే వరకు వెళ్లింది. ఘర్షణతో పలువురి చొక్కాలు కూడా చినిగిపోయాయి.

పోలీసులు మాత్రం సకాలంలో స్పందించకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యూరు. ఆలస్యంగా గ్రామానికి చేరుకుని అక్కడి నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలను వెళ్లగొట్టారు. ఈ సందర్భంగా పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య కొద్దిసేపు  వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు వారిని అక్కడి నుంచి పంపి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మళ్లీ ఎలాంటి గొడవలు తలెత్తకుండా స్థానిక ఎస్సైతోపాటు సీఐ   వెంకటేశ్వర్‌రెడ్డి పర్యవేక్షించారు.
 
మనోజ్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
టీఆర్‌ఎస్ ప్రచారాన్ని అడ్డుకోవడంతోపాటు గొడవ సృష్టించడమేగాక అనుమతి లేకుండా గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిచిన టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్  కట్టా మనోజ్‌రెడ్డితోపాటు సర్పంచ్ పిండి రవి, ఎంపీటీసీ అభ్యర్థి మోహన్‌రావుతోపాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా సాయంత్రం మామూనూరు డీఎస్పీ సురేష్‌కుమార్ గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. జరిగిన ఘటనపై గ్రామస్తులను ఆయన వివరాలు అడిగి  తెలుసుకున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement