ఫీల్డ్ అసిస్టెంట్ బలవన్మరణం | Field assistant commits suicide | Sakshi
Sakshi News home page

ఫీల్డ్ అసిస్టెంట్ బలవన్మరణం

Oct 25 2015 11:02 AM | Updated on Nov 6 2018 7:56 PM

అప్పుల బాధ భరించలేక ఫీల్డ్ అసిస్టెంట్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

కొనిజెర్ల (ఖమ్మం) : అప్పుల బాధ భరించలేక ఫీల్డ్ అసిస్టెంట్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా కొనిజెర్ల మండలం బసవాపురం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన చల్లా వీరబాబు(38) గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఔట్‌సోర్సింగ్ ఫీల్డ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు.

ఈ క్రమంలో తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన రెండెకరాలలో పత్తి సాగు చేశాడు. నీళ్లు లేక అది ఎండిపోవడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement