ఇలా ఓ నాన్న తీర్పు | Father murdered son in warngal district | Sakshi
Sakshi News home page

ఇలా ఓ నాన్న తీర్పు

Oct 25 2014 2:25 AM | Updated on Sep 2 2017 3:19 PM

తల్లితో కమల్, నిందితుడు ఆంజనేయులు(ఫైల్)

తల్లితో కమల్, నిందితుడు ఆంజనేయులు(ఫైల్)

కన్నకొడుకును దారుణంగా గొంతు నులిమి హత్య చేయడంతో పాటు, మృతదేహా న్ని చెరువులో పడేసిన సంఘటన వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడిలో బుధవారం జరిగింది.

కొడుకును గొంతు నులిమి చంపిన తండ్రి
 పాలకుర్తి: కన్నకొడుకును దారుణంగా గొంతు నులిమి హత్య చేయడంతో పాటు, మృతదేహా న్ని చెరువులో పడేసిన సంఘటన వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడిలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన మహంకాళి ఆంజనేయులు- కవిత దంపతులకు కుమారులు రాకేష్, కమల్ ఉన్నారు. ఆంజనేయులు హైదరాబాద్‌లో కూలీ పనులు చేసుకుంటూ తల్లి వద్ద ఉంటుండగా, కవిత గ్రామంలోనే ఉంటూ పిల్లల్ని పోషిస్తోంది. బుధవారం ఆంజనేయులు గ్రామానికి వచ్చి కొడుకులను శివారులోని ఎర్రచెరువు వద్దకు తీసుకెళ్లాడు. ఇంటికి వచ్చిన కవిత విషయం తెలిసి, గ్రామస్తులతో కలిసి పిల్లల కోసం వెతికింది.

అయితే, ఆంజనేయులు పెద్దకుమారుడు రాకేష్‌ను తీసుకొని తీగారం గుట్టకు వెళ్లాడు. బంధువులకు రాత్రి 8 గంటల ప్రాంతంలో ఫోన్ చేసి ‘చెరువు గట్టు మీద చిన్న కొడుకు కమల్ గొంతు పిసికి చంపేసి, చెరువులో పడేశాను.’అని చెప్పాడు. అయినా వాళ్లు పట్టించుకోలేదు. కాగా, గురువారం ఆంజనేయులు భార్యకు ఫోన్ చేసి.. ‘చిన్నోన్ని చంపేసి పెద్దోన్ని తీసుకొస్తున్నా’ అని చెప్పాడు. గ్రామస్తులు చిన్న కొడుకు గురించి ప్రశ్నించగా, చెరువులో శవాన్ని చూపించాడు. ఆగ్రహించిన గ్రామస్తులు నిందితుడిని చితకబాది జనగామ పోలీసులకు అప్పగించారు.

Advertisement
 
Advertisement
Advertisement